'అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ' ఆ జిల్లాకు మణిహారం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 13 |
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆ జిల్లాకు మణిహారం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నూతనంగా ఏర్పాటైన మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కు చైర్మన్, సలహా కమిటీ సభ్యులను నియామకం చేస్తూ.. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ఈ నెల 4న 229 GO ను జారీ చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. "ముడా" కు నూతన అధ్యక్షుడు, సలహా కమిటీ సభ్యులు మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యంగా మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద రెండవ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయిందని తెలిపారు. మొత్తం 12 మండలాలు, 143 గ్రామాలు, 3 మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా 1444.69 చదరపు కిలోమీటర్లతో ఏర్పాటైంది.

"మూడా" చైర్మన్‌గా నిజాయితీపరుడైన, కౌన్సిలర్‌గా అనుభవం ఉన్న గంజి వెంకన్న ముదిరాజ్‌ను నియమించడం జరిగిందన్నారు. అదేవిధంగా అడ్వైజరీ సభ్యులుగా జడ్చర్ల కు చెందిన ఎం. శ్రీకాంత్, కోడుగల్‌కు చెందిన మహమ్మద్ ఇంతియాజ్, జడ్చర్లకు చెందిన బి. రవి శంకర్, బాల నగర్‌కు చెందిన ఆర్. భూపాల్, రాజాపూర్‌కి చెందిన ఎం. శ్రీశైలం యాదవ్, జడ్చర్లకు చెందిన వై.జి ప్రీతం కుమార్, నవాబుపేట్‌కు చెందిన జి. చెన్నయ్య, జమిస్తాపూర్‌కు చెందిన కె. ఆంజనేయులు, మహబూబ్ నగర్‌కు చెందిన ఏ. సాయి లు యాదవ్, పి. వెంకటేష్ గౌడ్, హన్వాడకు చెందిన కొండ బాలయ్య, మహబూబ్ నగర్‌కు చెందిన మిర్యాల వేణుగోపాల్ గుప్త, భూత్పూర్‌కు చెందిన ఎస్. చంద్రశేఖర్ గౌడ్, అమిస్తాపూర్‌కు చెందిన ఎం. సాయి లు, దేవరకద్ర కు చెందిన కె. లక్ష్మీకాంతరావు ఉన్నారు.

త్వరలోనే "ముడా" కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. నిజాయితీకి, నమ్మకానికి ఉదాహరణ ముడా చైర్మన్, సభ్యుల పదవులని, కష్టపడి పనిచేసిన వారికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సభ్యులందరూ జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా పని చేయాలన్నారు. "ముడా"తో జిల్లా శర వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని మంత్రి ఆన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముడా చైర్మన్, అధ్యక్ష , సలహా సభ్యులను శాలువా పూల మాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed