ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త.. ఈ అవకాశాన్ని మిస్ కావద్దు..

by Disha News Desk |
ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త.. ఈ అవకాశాన్ని మిస్ కావద్దు..
X

దిశ, సైదాపూర్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, హైదరాబాద్ నందు బీఈ/బీటెక్/డిప్లమా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేట్ల షెడ్యూల్ కాస్ట్ యువత కోసం 6 నెలల ప్లేస్‌మెంట్ లింక్డ్ సర్టిఫికెట్ కోర్సు ఇన్ కన్స్‌స్టక్షన్ సెప్టీ ప్రోగ్రామ్‌ను ఎస్.సి.కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించాలని న్యాక్ యోచిస్తోందని అసిస్టెంట్ డైరెక్టర్ అంజయ్య తెలిపారు. కాగా ఈ నెల 7న సర్టిఫికెట్ వెరిఫికేషన్ న్యాక్ కార్యాలయం హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్ నందు నిర్వహించ బడుతుందన్నారు. కావున సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, పదో తరగతి, ఇంటర్మీడియట్/ డిప్లొమా, బీటెక్ ,బీ,ఈ, ఆధార్, కొత్త ఆదాయం, కులం ధ్రువీకరణ పత్రం తీసుకురాగలరు. సంప్రదింపులకు ఇ. అంజయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ నెంబర్: 9676287287

Next Story

Most Viewed