ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి: భారత మీడియాను కోరిన రష్యా ఎంబసీ

by Web Desk |
ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి: భారత మీడియాను కోరిన రష్యా ఎంబసీ
X

కీవ్: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్దంపై భారత మీడియాలో వస్తున్న వార్తలపై రష్యా స్పందించింది. యుద్ధానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని భారత్‌లోని రష్యా ఎంబసీ ట్విట్టర్ ద్వారా కోరింది. ఈ మేరకు సోమవారం మీడియా అడ్వైజరీ విడుదల చేసింది. 'ఉక్రెయిన్ సంక్షోభంపై భారత మీడియా ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. ప్రజలకు నిష్పాక్షికమైన సమాచారం అందివ్వాలని కోరుతున్నాం. రష్యా ప్రతిసారి చర్చలకు, సంప్రదింపులకు చొరవ చూపుతుంది. ఉక్రెయిన్‌లో ఉన్న న్యూక్లియర్ స్థావరాలు సురక్షితంగానే ఉన్నాయని అంతర్జాతీయ అణుశక్తి ఏజేన్సీ నిర్ధారించింది. రష్యన్ సైనికులు ప్రజలను కవచాలుగా చేసుకోరు. యుద్ధ ఖైదీల పట్ల గరిష్ట మర్యాదను ప్రదర్శిస్తారు' అని పేర్కొంది. అంతేకాకుండా పౌరులు, నగరాలపై కాకుండా మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు తెలిపింది. కాగా ఏకపక్షంగా వ్యవహరించకూడదని సూచించింది.



Next Story

Most Viewed