ఫ్లిప్‌కార్ట్ సేల్ బ్యాక్ ఆఫర్.. పాత ఫోన్ అమ్మి కొత్తది కొనండి

by Web Desk |
ఫ్లిప్‌కార్ట్ సేల్ బ్యాక్ ఆఫర్.. పాత ఫోన్ అమ్మి కొత్తది కొనండి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ సోమవారం సేల్ బ్యాక్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. వినియోగదారులు వారి పాత మొబైల్ ఫోన్‌లను విక్రయించడానికి ఈ ప్లాట్‌ఫారమ్ ఉపయోగపడుతుంది. వాలంటైన్స్ డే సంద‌ర్భంగా సేల్ బ్యాక్ ప్రోగ్రామ్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. రీకామర్స్ ఆఫర్‌ను రూపొందించడంపై దృష్టి సారించి, ఎలక్ట్రానిక్స్ రీకామర్స్ కంపెనీ అయిన యంత్రని, ఇటీవల ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ఈ సేల్ బ్యాక్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది.

పాత ఫోన్ అమ్మాలనుకున్న వాళ్ళు యంత్ర వెబ్‌సైట్ ద్వారా అమ్మవచ్చు. మెుదటగా ఈ వెబ్‌సైట్‌కు వెళ్ళాక మూడు సాధారణ ప్రశ్నలకు సమాధానాల ఆధారంగా కస్టమర్‌లకు వారి స్మార్ట్‌ఫోన్ విలువ చూపబడుతుంది. కస్టమర్ ధృవీకరించిన తర్వాత, ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్‌లు 48 గంటల్లో పాత ఫోన్‌ను కలెక్ట్ చేసుకుంటారు. తరువాత కస్టమర్‌కు ఫ్లిప్‌కార్ట్ వోచర్‌ను పంపిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసినా, కొనుగోలు చేయకపోయినా ఈ ప్రోగ్రామ్ అన్ని మొబైల్ ఫోన్‌లకు వర్తిస్తుంది. ఈ ఏడాది చివర్లో ఈ పొగ్రామ్‌ను మరిన్ని వస్తువులకు విస్తరించనున్నారు. ప్రస్తుతం,ఇది ఢిల్లీ, కోల్‌కతా, పాట్నా వంటి నగరాల్లో 1,700 పిన్ కోడ్స్ ప్రాంతాలలో అందుబాటులో ఉంది.

"ఫ్లిప్‌కార్ట్ సేల్ బ్యాక్ ప్రోగ్రామ్‌తో, మార్కెట్‌ను మరింత విస్తరించగడానికి లక్ష్యంగా పెట్టుకున్నాము. భారతీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్నందున, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడంలో కీలకమైన ఈ-వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడానికి ఈ కార్యక్రమం మా ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళుతుంది, "అని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లిప్‌కార్ట్ గ్రోత్ చార్టర్ హెడ్ ప్రకాష్ సికారియా చెప్పారు.



Next Story

Most Viewed