యాదగిరిగుట్ట ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు..

by Disha Web Desk 13 |
యాదగిరిగుట్ట ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు..
X

దిశ, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో ప్రతి రోజు నిరసన జ్వాలలు పెరుగుతున్నాయి. యాదగిరిగుట్టలో ఈవో వైఖరికి నిరసనగా ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. అలాగే యాదాద్రి కొండపైకి వాహనాలపై స్థానిక మున్సిపల్ పాలకవర్గం సభ్యులు వెళ్తుండగా కొండపైకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో వెంటనే కొండ కింద ఘాట్ రోడ్డు వద్ద ధర్నాకు దిగారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు యాదగిరిగుట్ట కొండపైకి వెళ్తున్న కౌన్సిలర్లను యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్, ఎంపీపీని ఘాట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.


దీంతో ఘాట్ వద్ద బైఠాయించి వారు ప్రజాప్రతినిధులను ఎలా అడ్డుకుంటారని వాగ్వాదానికి దిగారు. ఈవో ఆఫీసర్లకు సంబంధించిన భక్తుల వాహనాలను కొండపైకి ఎలా అనుమతిస్తారని నిరసన వ్యక్తం చేశారు. ఈవో గీతారెడ్డి వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలే సమస్య లేదని బైఠాయించి నిరసన తెలిపారు. చాలా సేపు ధర్నా చేసిన కౌన్సిలర్ల వద్దకు ఏఈవోలు వచ్చి చర్చలు జరిపారు. దీంతో ధర్నా విరమించారు.


మున్సిపల్ పాలకవర్గం మరో వైపు ఆటో కార్మికులు, స్థానికులు బస్ స్టాండ్ చౌరస్తా వద్ద భక్తుల పట్ల యాదాద్రి ఈవో గీతారెడ్డి వైఖరికి నిరసనగా ఈవో దిష్టిబొమ్మను స్థానికులు, ఆటో కార్మికులు దగ్ధం చేశారు. కొండపైకి అన్ని వాహనాలను అనుమతించాలని, స్థానికులకు ఎలాంటి షరతులు లేకుండా దర్శనాలు కల్పించాలని, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. అదేవిధంగా భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed