తీసివేతలు, కూడికల్లో 'చేపలు' వెరీ షార్ప్

by Disha Web Desk 12 |
తీసివేతలు, కూడికల్లో చేపలు వెరీ షార్ప్
X

దిశ, ఫీచర్స్ : స్టడీస్‌లో మెజారిటీ విద్యార్థులను భయపెట్టే సబ్జెక్ట్స్‌లో 'మ్యాథ్స్' టాప్ ప్లేస్‌లో ఉంటుంది. లెక్కల చిక్కులు, ఫార్ములా జిమ్మిక్కులు తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. కానీ ఎక్కాలు, లెక్కల పాఠాలు విననివాళ్లు కూడా కూడికలు, తీసివేతలు పర్‌ఫెక్ట్‌గా చేస్తుంటారు. అయితే ఇలాంటి స్కిల్స్.. మనుషులకే కాకుండా చేపలు కూడా ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ బాన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. మరి చేపల గణిత సామర్థ్యాలు ఏ పాటివో మనమూ తెలుసుకుందాం.

ఒక టేబుల్‌పై తక్కువ సంఖ్యలో నాణేలు ఉంటే వాటిని ప్రత్యేకంగా లెక్కించాల్సిన అవసరం లేదు. ఒక్క చూపుతోనే కాలిక్యులేషన్ పూర్తయిపోతుంది. ఈ విషయంలో 'సిచ్లిడ్స్, స్టింగ్రేస్' అనే చేపలు కూడా మనుషులతో సమానంగా తెలివి ప్రదర్శిస్తాయని, చిన్న పరిమాణాలను గణిస్తాయని పరిశోధకులు గుర్తించారు. సాధారణ కూడికలు, తీసివేతలకు సంబంధించి ఆ చేపలకు శిక్షణనిచ్చారు. ఇందులో భాగంగానే కలర్ కోడింగ్‌తో చేపల్లోని గణిత సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఉదాహరణకు : నీలం అంటే 'ఒకటి జోడించు', పసుపు అంటే 'ఒకటి తీసివేయు' అనే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇక సరైన సమాధానం చెప్పినప్పుడు వాటికి ఆహారం బహుమతిగా ఇచ్చేవారు. అదే తప్పు సమాధానం చెప్తే రిక్తహస్తాలతో వెనుతిరిగేవి.

'ముందగా నీలం రంగు చతురస్రాలు, పసుపు రంగు త్రిభుజాలతో కూడికలు(2+1, 3+1), తీసివేతల(3-1, 2-1) ప్రయత్నించాం. ఆ తర్వాత 3+1, 3-1 అంటూ మిక్స్‌డ్ ప్రాబ్లమ్స్‌తో చేపలను పరీక్షించాం. అవి ఎక్కువ సార్లు సరైన సమాధానాన్నే ఎంచుకోవడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే చేపలకు నియోకార్టెక్స్(మానవ మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్‌లో ఇది భాగం కాగా.. గ్రహణశక్తి, భాష వంటి నిర్ణయాత్మక విషయాల విధులకు ఇది కేంద్రం) లేకపోయినప్పటికీ ఇదెలా సాధ్యమనేది పలువురి సందేహం. కానీ క్షీరదాల్లోని 'సెరిబ్రల్ కార్టెక్స్'.. సంక్లిష్టమైన మెమొరీ పనులకు బాధ్యత వహిస్తుందని గుర్తించాలి.

బాన్ పరిశోధకుల బృందం



Next Story

Most Viewed