పరీక్షలు వస్తున్నాయి.. ఇంకా పూర్తికాని సిలబస్.. ఎలా మరి..?

by Disha Web Desk 13 |
పరీక్షలు వస్తున్నాయి.. ఇంకా పూర్తికాని సిలబస్.. ఎలా మరి..?
X

దిశ, కొడంగల్: కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత ప్రారంభమైన విద్య సంస్థలు ఈ సారైనా పూర్తి స్థాయిలో తరగతుల నిర్వహణ సాధ్యం అవుతుందా.. లేదా.. అని ఇటు ప్రభుత్వం, విద్యాసంస్థలకు ఓ పెద్ద ఆలోచనదాయకమైన విషయం. అలాగే తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని స్కూళ్లు, కాలేజీలకు పంపాలంటే అదో రకమైన భయం. ఫీజులు కట్టడం కూడా ఆర్థిక భారమని చెప్పవచ్చు. చివరికి కరోనా నిబంధనలతో విద్యాసంస్థలను నడిపించినా.. కాస్త ఇబ్బందులు తలెత్తుతాయని కూడా చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా ప్రభుత్వం వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేయడం పూర్తి కావొస్తున్నా.. విద్యార్థుల్లో పరీక్షల భయం ఇప్పుడే ప్రారంభమైంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సిలబస్ పూర్తి కాలేదని తెలిసింది.

దీనికి కరోనా నిబంధనలు ఒక్కటైతే.. ఈ సారి ఉపాధ్యాయుల బదిలీల వల్ల కూడా తరగతుల నిర్వహణలో ఒక మాసం అంతరాయం ఏర్పడింది. బదిలీలు పూర్తయిన తర్వాత కూడా నూతనంగా వచ్చిన సిబ్బందితో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమన్వయం కోసం కొద్దిగా సమయం పట్టింది. దీనికి తోడు మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడులు ప్రారంభమవడం తో సిలబస్ పూర్తి చేయడం కోసం సమయం తక్కువ అయిందని కొందరు ఉపాధ్యాయులు అంటున్నారు. ఇన్ని చిక్కుముడుల మధ్య ఈ సారి పరీక్షల నిర్వహణ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా.. గందరగోళంగా టైం టేబుల్ ను ప్రకటించడంతో విద్యార్థుల్లో భయం మొదలైంది. కొందరు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

నిపుణుల మాట..

ఈ సారి ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో విద్యార్థులు అనవసరంగా ఆందోళన చెందకుండా ఉపాధ్యాయుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఆన్ లైన్ తరగతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి ఆహౕర పదార్థాలకు కాస్త దూరంగా ఉంటూ.. ఆహౕర నియమాలు పాటించాలని అంటున్నారు. లేని పక్షంలో పరీక్షల సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

సిలబస్‌పై పట్టు సాధించాలి..

విద్యార్థులు పూర్తి స్థాయిలో సిలబస్ పై పట్టు సాధించి తరగతి గదిలో ప్రిపేర్ చేసుకున్న నోట్స్ తో అకాడమీ పుస్తకాలు చదవడం మంచిదని.. అనవసరంగా ఒత్తిడితో ప్రైవేట్ పబ్లికేషన్స్ బుక్స్ చదవడం కాస్త మెరుగైన ఫలితాలు సాధించడంలో ఇబ్బందులు ఏర్పడుతాయని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.



Next Story

Most Viewed