కంప్యూటర్లలో డ్రగ్స్ అడిక్టర్స్ జాబితా.. రాజకీయ నాయకులే నిర్వాహకులు..!

by Disha Web Desk 2 |
కంప్యూటర్లలో డ్రగ్స్ అడిక్టర్స్ జాబితా.. రాజకీయ నాయకులే నిర్వాహకులు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: "ఇటీవల కొరటాల శివ దర్శకత్తంలో తెరకెక్కిన 'భరత్​ అనే నేను' అనే సినిమాలోని ఓ ప్రధానమైన పార్ట్​కండ్ల ముందు కనిపిస్తోంది. పార్టీ పెద్ద ఒకాయన ఓ పెద్ద దావత్ ఏర్పాటు చేసి.. ముఖ్యమైన విషయం మాట్లాడుకుందామని సీఎం (సినిమా హీరో)ను పిలుస్తాడు. అప్పుడప్పుడే విదేశాల నుంచి వచ్చి అనూహ్యంగా సీఎం సీటు ఎక్కిన సదరు హీరోకు అదంతా కొత్తగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ పార్టీలో అసెంబ్లీలో నిత్యం దూషించుకునే ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్లు కనిపించే సంఘాలు, ఇతర పార్టీల నేతలంతా అక్కడ మందు పార్టీలో ఉంటారు. ఆ సందర్భాన్ని పార్టీ పెద్ద వివరించిన తీరు ఇప్పుడు ఆవిష్కృతమవుతోంది. "మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్లను.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు మనల్ని.. ఇలా కాపాడుకోవాలి. అలా అయితేనే రాజకీయం. బయటా, అసెంబ్లీలో ఎంత కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. అంతా మనలో మనమే." ఇది అప్పుడు అక్షరాల డ్రగ్స్​ కేసుకు అతికినట్టైంది. అంతేకాదు.. సామాజిక అంశాలతోనే ఈ కథను అల్లుకున్నానని ఓ సందర్భంగా డైరెక్టర్​ కొరటాల శివ కూడా చెప్పుకొచ్చారు.

అసలు దాడి ఎందుకు జరిగినట్టు?

డ్రగ్స్ దందాల్లో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోనే మొత్తం 61 పబ్‌లు నడుస్తున్నాయి. వీటిలో రెండు మాత్రమే 24 గంటలు నడిచే పబ్‌లు. అందులో ఒకటి నోవాటెల్, మరోకటి రాడిసన్‌లోని పుడింగ్ మింక్ పబ్. ఇక్కడ నిరంతరం మద్యం అమ్ముతారు. రాడిసన్​హోటల్‌లోని ఈ పబ్​ఓ మాజీ ఎంపీ కూతురు ప్రారంభిస్తే.. మరో జాతీయ పార్టీకి చెందిన నేత కొడుకు నడిపిస్తున్నాడు. ఉదయం వరకూ పోలీసుల జాబితాలో లేని కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ పార్టీకి మైనర్లను యాజమాన్యం అనుమతించినట్లు పోలీసుల విచారణలో తెలిపారు. ప్రస్తుతం పబ్‌ను నడిపిస్తున్న అభిషేక్‌ ఉప్పాల, అనిల్‌ను అరెస్ట్‌ చేయగా.. మరో ఇద్దరు అర్జున్‌, కిరణ్‌రాజ్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఏ1 అనిల్‌, ఏ2 అభిషేక్‌, ఏ3 అర్జున్‌, మాజీ ఎంపీ రేణుకాచౌదరి అల్లుడు కిరణ్‌రాజ్‌ను ఏ4 నిందితుడిగా పోలీసులు చేర్చారు. 2017-20 వరకు తన భార్యతో కలిసి కిరణ్‌రాజ్‌ పబ్‌ నడిపాడు. 2020 ఆగష్టులో అభిషేక్‌, అనిల్‌కు లీజు ఇచ్చిన కిరణ్‌రాజ్‌ ఇంకా పార్ట్‌నర్‌గా కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలిందంటున్నారు. కాంగ్రెస్​నేత రేణుకాచౌదరి కూతురు ప్రారంభిస్తే.. బీజేపీ నేత శారద కొడుకు దాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. అయితే, ఈ పబ్‌లో 24 గంటల మద్యం సప్లయికి అనుమతి ఉంది. కానీ, అనూహ్యంగా పోలీసులు ఎందుకు డెకాయి ఆపరేషన్ చేశారనే అనుమానాలుకు సమాధానాలు ఇవ్వడం లేదు. పోలీసులు చాలా రోజుల నుంచే ఈ పబ్‌పై ఫోకస్ పెట్టారని, అందులో భాగంగానే ఇప్పుడు భారీగా డ్రగ్స్​ సరఫరా అయిన తర్వాత దాడులు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, పట్టుకున్న డ్రగ్స్​ అతి తక్కువే. ఎక్కువ స్థాయిలో డ్రగ్స్​ ఉంటే.. ఉన్నపళలంగా ఏం చేశారో పోలీసులు కనిపెట్టలేకపోయారనే అనుమానాలున్నాయి.

అన్నింటా ప్రొఫైల్

తాజాగా.. ఈ డ్రగ్స్ అంశంలో పబ్​లన్నింటిదీ ఒకేదారి అన్నట్టుగా మారింది. అర్థరాత్రి 12 గంటల వరకు నడిచే మిగతా పబ్​ల్లోనూ ఇదే తరహా డ్రగ్స్​ దందా సాగుతోంది. దీనికోసం నిర్వాహకులు ప్రత్యేక ప్రొఫైల్​ను మెంటెయిన్​ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీనికోసం రెగ్యులర్​ కస్టమర్లతో ఒక గ్రూప్‌ను అన్ని పబ్‌లు నడిపిస్తున్నాయి. వీకెండ్‌లో తమ కస్టమర్లకు గ్రూప్ మెస్సేజ్‌ను పంపిస్తూ సమాచారమిస్తున్నట్లు తేలింది. పబ్‌లు తమ కస్టమర్ల జాబితాను చాలా సీక్రెట్‌గా దాచి పెడుతుంటోంది.

హార్డ్ డిస్క్‌లు ముట్టుకోవడం లేదు

పబ్‌ల నిర్వహణ ఓవైపు అయితే.. పోలీసుల తీరుపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఈ పబ్‌లు సమయం దాటి నడిపితే.. దానిపై చర్యలు తీసుకోవడంలో అటు పోలీసులకు ఎంత పాత్ర ఉందో.. అంతే పాత ఎక్సైజ్ అధికారులకూ ఉంటోంది. కానీ, రాడిసన్ హోటల్ ఇష్యూలో కేవలం పోలీసులపై చర్య తీసుకున్నారు. ఎందుకంటే ఈ కేసును ఒక విధంగా నీరుగార్చేందుకే పోలీస్ ఉన్నతాధికారులు ఈ ప్లాన్ వేశారనే ప్రచారం జరుగుతోంది. లేకుంటే ఈ పబ్ చాలా కార్యకలాపాలకు వేదికగా మారిందనే ఆరోపణలున్నాయి. మైనర్లు మాత్రమే కాకుండా ఇక్కడ డ్రగ్​ ఫెడ్లర్లు మకాం వేస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇద్దరు వేర్వేరు రాజకీయ పార్టీల నేతల కుటుంబాలతో సంబంధం ఉన్న ఈ పబ్​లో అధికార పార్టీకి చెందిన వారికీ లింకులున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే, ఈ పబ్‌లోకి రావాలంటేనే పాస్​వర్డ్ కంపల్సరీ అని చెప్పుతున్న పోలీసులు.. సినిమా తారలు, సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులతో ఓ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారంటున్నారు. అంటే వాళ్ల భాషలో మంచి డ్రగ్ వచ్చిందంటూ వీరందరికీ గ్రూప్ సమాచారం చేరుతుంది. మొత్తం ఆన్​లైన్ ద్వారా నిర్వహించే ఈ సమాచారంలో వారధిగా ఉండే కంప్యూటర్లను పోలీసులు వదిలేస్తున్నారు. అంతేగాకుండా పోలీసులు దాడులు చేస్తున్నప్పడు ఈ కంప్యూటర్లు కనిపిస్తున్నా.. వాటి హార్డ్ డిస్క్‌లు తీసుకోవడం మరిచిపోతున్నారు. అంతేగాకుండా కీలకమైన సమాచారం, ఇప్పటి వరకు పంపిన మెస్సెజ్‌ల వివరాలు కూడా ఈ కంప్యూటర్లల ఉండే అవకాశాలున్నాయి.

పార్టీ ఏదైనా.. ఇదే రూటు

హైదరాబాద్‌లో ఉన్న 61 పబ్‌లో 40 పబ్‌ల వరకు రాజకీయ నేతలకు లింకులున్నవే. కారు, హస్తం, కమలం.. ఇలా ప్రధాన పార్టీల నేతల ఆధీనంలోనే ఉన్నాయి. తాజాగా పుడింగ్ మింక్ పబ్‌లో పొలిటికల్ ప్రమేయం బయటకొచ్చింది. డ్రగ్స్​పై చర్యలు తీసుకోవాలంటూ ఈ మూడు పార్టీల నేతలు ప్రకటనలు చేస్తున్నా.. వారందరికీ లింకులుంటున్నాయి. ఇలా చాలా క్లబ్‌లు వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. రాజ్ భవన్ రూట్‌లోని ఓ పబ్.. ఏకంగా ఓ ఎమ్మెల్సీ కుటుంబమే నిర్వహిస్తోందని, హైటెక్​సిటీలోని ఓ పబ్ హస్తం పార్టీ కీలక నేత అల్లుడు నడుపుతున్నాడని పోలీసులే గుర్తించారు. ఇలా పార్టీలు ఏదైనా.. వ్యాపారాలు.. అక్రమ వ్యాపారాలు నిర్వహించడంలో మాత్రం కలిసికట్టుగానే ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

వీకెండ్ అంటే డ్రగ్స్

పబ్‌లో వీకెండ్ పార్టీ అంటేనే డ్రగ్ పార్టీలు అని ఎక్సైజ్​ అధికారులు ఆఫ్ ది రికార్డు అంటున్నారు. తమ రెగ్యులర్ కస్టమర్లకు వీకెండ్ పార్టీల పేరుతో డ్రగ్స్​ ఆఫర్లు ఇస్తున్నారు. కస్టమర్లను ఎంట్రీలో ఆధార్ వివ‌రాలు తీసుకోకుండానే మైన‌ర్లను ప‌బ్‌లోకి అనుమ‌తిస్తున్నారు. మైన‌ర్లకు లిక్కర్, డ్రగ్ కూడా ఇచ్చారు. ఇక బర్త్​డే పార్టీలకు పబ్​ నిర్వాహకులే డ్రగ్ సప్లయర్లకు సమాచారమిస్తున్నారు. తాజాగా.. వెలుగులోకి వచ్చిన పుడింగ్​మింక్​పబ్‌ను నడుపుతున్నది రాజకీయ ప్రముఖుల వారసులు అయితే.. అందులోకి వెళ్లేది కూడా వాళ్లే. పోలీసుల రిపోర్ట్​ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా సిద్ధార్థ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, బిగ్‌బాస్‌ విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు ఉన్నట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed