సిడ్మస్‌ కోసం నోవార్టిస్‌తో ఒప్పందం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్

by Disha Web Desk 17 |
సిడ్మస్‌ కోసం నోవార్టిస్‌తో ఒప్పందం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ జనరిక్ ఔషధాల తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్, కార్డియోవాస్కులర్ బ్రాండ్ సిడ్మస్‌ను రూ. 463 కోట్లకు (61 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసేందుకు నోవార్టిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఒప్పందం ప్రకారం, డాక్టర్ రెడ్డీస్‌కు భారతదేశంలో సిడ్మస్ ట్రేడ్‌మార్క్ కేటాయించడం జరుగుతుంది. భారతదేశంలో సిడ్మస్ అమ్మకాలు ఫిబ్రవరి 2022 తో ముగిసిన పన్నెండు నెలల కాలానికి రూ.136.4 కోట్లుగా ఉన్నాయి. డా. రెడ్డీస్ భారతదేశంలోని టైర్-I, టైర్-II మెట్రోలలో మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా యాక్సెస్‌ను పెంచుకోవడానికి చూస్తుంది. "Stamlo, Stamlo Beta, Reclide-XR, Reclimet-XR వంటి ప్రముఖ బ్రాండ్‌లతో పాటు కార్డియోవాస్కులర్ విభాగంలో కంపెనీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోకు Cidmus ఒక అదనపు బలంగా ఉంటుంది. టాప్ 10 కార్డియాక్‌లలోకి ప్రవేశించాలనే దాని ఆశయానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇండియాలో క్రానిక్ స్పేస్‌లో డాక్టర్ రెడ్డీస్ ఉనికిని బలపరుస్తుంది.

Next Story

Most Viewed