క్రీడారంగం ను ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేస్తాం.. మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 2 |
క్రీడారంగం ను ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేస్తాం.. మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి : క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలంపిక్ రన్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి ఒలింపిక్ టార్చ్‌ను వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాధాన్యత క్రమంలో క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. వనపర్తి మండలం చిట్యాల తూర్పు తండ కు చెందిన గిరిజన క్రీడాకారిణి ప్రతిభను గుర్తిస్తూ.. మంత్రి తన జీతంలో లక్ష రూపాయల నగదును అందించానని, కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేస్తామని చెప్పారు.

విద్యార్థులు విద్యలో భాగంగా క్రీడలను కూడా సాధన చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచాలని కోరారు. వ్యాయామ ఉపాధ్యాయులు శిక్షణ ద్వారా హాకీ, ఫుట్ బాల్, అథ్లెటిక్స్, ఇతర క్రీడలలో ప్రతిభావంతులను గుర్తించడం అభినందనీయమన్నారు. జూనియర్ కళాశాల మైదానంను భవిష్యత్తులో ఆదర్శ క్రీడామైదానంగా తీర్చిదిద్దుతామని హమీ ఇచ్చారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజలు బాధ్యతతో మొక్కలు నాటలని, ఇతరులతో నటించాలని, నాటిన మొక్కలను సంరక్షించాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ సుధీర్ కుమార్ రెడ్డి, పీడీ సురేందర్ రెడ్డి, పీఈటీలు కుమార్, శ్రీనివాస్, నందిమల్ల తిరుపతి, శ్రీకాంత్, మధు, నిరంజన్ గౌడ్, రాజేందర్, శిరీష, పద్మా, రామ చంద్రమ్మ, రంగనాయకమ్మ, సుజాత, శ్రీదేవి, కొచ్ సాగర్, పాఠశాల విద్యార్థులు తడుతరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed