'దిశ' కథనానికి స్పందించిన జిల్లా మైనింగ్ అధికారులు

by Web Desk |
దిశ కథనానికి స్పందించిన జిల్లా మైనింగ్ అధికారులు
X

దిశ, హాలియ: ఈ నెల 7వ తేదీన 'దిశ' పేపర్ లో ప్రచురించబడిన "రెచ్చిపోతున్నా అక్రమ ఇసుక మాఫియా" కథనానికి జిల్లా మైనింగ్ అధికారులు స్పందించారు. పాలెం రీచ్ లో రైతుల బొర్లను పీకేసి, రైతులను బెదిరించి, ఇష్టానుసారంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ.. రైతులు 'దిశ' పెపర్‌ను ఆశ్రయించారు. దీనిలో భాగంగా 'దిశ' ప్రతినిధి వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి 7వ తేదీన తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనిపై అధికారులు కొద్ది రోజులు రిచ్ ను బంద్ చేయాలంటూ ఇసుక రిచ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

'దిశ' ప్రతినిదికి ఇసుక వ్యాపారుల నుంచి బెదిరింపులు..

అక్రమ ఇసుక వ్యాపారానికి అలవాటుపడిన కొంతమంది శుక్రవారం ఉదయం నుంచి ఫోన్ ద్వారా బెదిరింపులకు దిగడం తో పాటు, 'దిశ' పేపర్ పై కేసులు పెడతామని, రేపు పేపర్ లో మాకు మీది తప్పుగా రాసినట్టు రాయాలంటు తెలపడం గమనార్హం.

సతీష్ కుమార్ (రైతు)..

2016 -17 లో కోర్టు నుంచి స్టె తీసుకొచ్చాము. అప్పటి హాలియ ఎస్సై గా పని చేస్తున్న వీర రాఘవులు స్టె అయ్యే వరకు ఇసుకను తరలించొద్దని తెలిపిన, పాలెం రిచ్ వారు ఇసుకను తరలించడం మొదలుపెట్టారు. స్టె సమయంలో కొంత మేర అడ్డం 120, పొడవు 85, అడ్డం1.6 లోతు వరకు రిచ్ వారు ఇసుకను తరలించవచ్చని సూచించారు. రైతుకు నష్టం కలగకుండా బోర్ వేసిన పాయింట్ దగ్గరకు రాకుండా ఇసుకను తీసుకోవాలని సూచించారు. కానీ గతంలో ఇక్కడ పని చెసిన.. సీఐ వీర రాఘవులు, ఎస్సై శివ కుమార్ బదిలీపై వెళ్ళాడం తో పాలెం రిచ్ వారు రైతు బోరుని సైతం వదలకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఇదేంటి అడిగిన రైతును బెదిరించడం మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన హాలియ ఎస్సై క్రాంతి కుమార్ పాలెం రిచ్ యజమానులకు రైతుల బోర్ల వద్ద లోడింగ్ చేయొద్దని చెప్పిన వినకుండా ఎత్తుతున్నారని రైతులు చెబుతున్నారు.



Next Story

Most Viewed