'అధికార పార్టీ నాయకులకేనా దళిత బంధు'

by Web Desk |
అధికార పార్టీ నాయకులకేనా దళిత బంధు
X

దిశ, చెన్నారావుపేట : తెలంగాణ ప్రభుత్వం దళితులకు అమలు చేస్తున్న దళిత బంధు పథకం అధికార పార్టీ నాయకులకేనా అని చెన్నారావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ ప్రశ్నించారు. శనివారం మండలంలోని లింగగిరి గ్రామ దళిత కుటుంబాలు, సర్పంచ్ భాస్కర్ తో కలిసి ఎంపీడీవో లలితకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని లింగగిరి గ్రామంలో అర్హులైన దళితులకు కాకుండా టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలను దళిత బంధు పథకానికి ఎంపిక చేశారని ఆరోపించారు. గ్రామంలో గ్రామసభ గాని, గ్రామ సర్పంచ్ గాని తెలియకుండా టీఆర్ఎస్ నాయకులే వారిని ఎంపిక చేసారన్నారు. దీనివల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన నిరుపేద దళితులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, చెన్నారావుపేట మండల ఉపాధ్యక్షులు న్నాన్నేబోయిన రమేశ్, లింగగిరి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed