మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ప్రజాసంఘాల ధర్నా.. ఎమ్మెల్యే చిట్టెం సీరియస్

by Disha Web Desk |
మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ప్రజాసంఘాల ధర్నా.. ఎమ్మెల్యే చిట్టెం సీరియస్
X

దిశ, మక్తల్ : టిప్పర్ యాక్సిడెంట్‌లో మృతి చెందిన మాల చెన్నప్ప కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చూస్తూ ఆయన మృతదేహంతో ప్రజాసంఘాల నాయకులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. అనుమతిలేని టిప్పర్లు, ఇసుక తరలించే వాహనాలు మక్తల్ జాతీయ రహదారిపై రోజూ వందలాది తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని, వారి నిర్లక్ష్యంతోనే శనివారం ఒక నిండు ప్రాణం బలి అయిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనుమతి లేకుండా తిప్పుతున్న టిప్పర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.

ఆర్టీఓపై ఎమ్మెల్యే సీరియస్

సరైన పత్రాలు లేకుండా జాతీయ రహదారిపై ప్రతిరోజు వందలాది టిప్పర్లు తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నా చెక్ పోస్ట్ వద్ద ఎందుకు తనిఖీలు చేయడం లేదని ఆర్టీఓ అధికారులపై మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. చెన్నప్పను ఢీకొట్టిన టిప్పర్‌కు సరైన పత్రాలు లేవని, డ్రైవర్‌కు లైసెన్స్ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలను సరిహద్దుల దగ్గర ఎందుకు తనిఖీ చేయడం లేదని అధికారులను నిలదీశారు. గతంలో తాను దగ్గరుండి థర్మల్ పవర్ నుండి అక్రమంగా బూడిద తరలిస్తున్న టిప్పర్‌లను క్రమబద్ధీకరించేలా చేశానని, అదే విధానం ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. నేటి నుంచైనా తెలంగాణలో ఎంటర్ అయ్యే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి వదిలేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీఏ అధికారులను ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి ఆదేశించారు.



Next Story