బీఏసీ సమావేశానికి సీఎం డుమ్మా

by Nagaya |
బీఏసీ సమావేశానికి సీఎం డుమ్మా
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. లంచ్ అవర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. కాగా, అతి ముఖ్యమైన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాకపోవడం గమనార్హం. సభలో చర్చించాల్సిన అంశాలు, పద్దులు, సభ నిర్వహణపై ఈ బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. కానీ కీలకమైన సమావేశానికి సీఎం హాజరుకాలేదు. దీనికి అధికార పక్షం నుంచి మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమాలకర్, చీప్ విప్ వినయ్ భాస్కర్ హాజరు కాగా, ఎంఐఎం నుండి అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క హాజరయ్యారు.

Next Story

Most Viewed