యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్

by Disha Web Desk 12 |
యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి పున:ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆలయంలో మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ప్రారంభం కానుంది. కాగా, ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత నేడు యాదాద్రి ప్రధాన ఆలయం పున:ప్రారంభం కానుంది. ఉదయం 11:55 గంటలకు ఆలయాన్ని పున:ప్రారంభించనున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం 12:10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:20 నుంచి స్వామివారి గర్భాలయ దర్శనం ప్రారంభం అవుతుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రధానాలయంలోకి భక్తులను అనుమతించనున్నారు. యాదాద్రి చేరుకున్న కేసీఆర్ ప్రధానాలయం, పరిసరాల ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఏరియల్ వ్యూ పరిశీలించారు.

సీఎం పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీని కోసం 4 వేల మంది పోలీసులు, 400 సీసీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం గా ఏర్పాటు చేశారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బృందాలతో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. భక్తుల కోసం జియో ట్యాగింగ్ ఏర్పాటుతో పాటు.. 70 ఎకరాల్లో వాహనాలు పార్కింగ్ కోసం సిద్ధం చేశారు.

Next Story