- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
మార్స్ గ్రహం సౌత్ పోల్‌ని తాకిన చైనా.. ఇవే దాని మొదటి ఫోటోలు

దిశ, వెబ్‌డెస్క్ః మానవ రహిత చైనీస్ స్పేస్‌క్రాఫ్ట్ మార్స్ గ్రహంపై అద్భుతాలు నమోదు చేసింది. గతేడాది ప్రారంభం నుండి అంగారక గ్రహం చుట్టూ ఇది 1,300 కంటే ఎక్కువ సార్లు ప్రదక్షిణ చేసిందని, ఆ తర్వాత, అంగారకుని దక్షిణ ధ్రువం దృశ్యాలతో సహా మార్స్ మొత్తాన్ని కవర్ చేసే చిత్రాల డేటాను పొందిందని చైనా జాతీయ మీడియా బుధవారం నివేదించింది. చైనాకు చెందిన టియాన్‌వెన్-1 ఫిబ్రవరి 2021లో రెడ్ ప్లానెట్‌ను విజయవంతంగా చేరుకుంది. ఒక రోబోటిక్, రోవర్ ఒక ఆర్బిటర్ అంతరిక్షం నుండి గ్రహాన్ని సర్వే చేయడానికి ఉపరితలంపై మొహరించాయి. ఇక, అంతరిక్షం నుండి తీసిన చిత్రాల్లో మార్టిన్ దక్షిణ ధ్రువం నుండి చైనా స్పేస్‌క్రాఫ్ట్ తీసిన మొదటి ఛాయాచిత్రాలుగా ఇవి నిలిచాయి. ఈ ప్రాంతంలోనే దాదాపు గ్రహపు నీటి వనరులు లాక్ చేయబడినట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
2018లో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్వహించే ఆర్బిటింగ్ ప్రోబ్, అంగారక గ్రహం దక్షిణ ధ్రువంలోని మంచు కింద నీటిని కనుగొన్న విషయం తెలిసిందే. అయితే, భూగర్భ జలాలను గుర్తించడం అనేది గ్రహం జీవ సంభావ్యతను గుర్తించడంలో కీలకం. అలాగే, అక్కడ జరుగుతున్న మానవ అన్వేషణకు శాశ్వత వనరును ఈ పరిశోధన అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక, ఇతర Tianwen-1 చిత్రాల్లో 4,000-km (2,485-mile) పొడవైన కాన్యన్ వల్లేస్ మారినెరిస్ ఛాయాచిత్రాలు, అరేబియా టెర్రా అని పిలువబడే అంగారక గ్రహానికి ఉత్తరాన ఉన్న ఎత్తైన ప్రదేశాల ప్రభావంతో ఏర్పడిన క్రేటర్స్ ఉన్నాయి. Tianwen-1 విశాలమైన మౌండర్ క్రేటర్ అంచు అధిక-రిజల్యూషన్ చిత్రాలను, అలాగే 18,000-metre (59,055-foot) Ascraeus Mons టాప్-డౌన్ వ్యూవ్‌ను తిరిగి పంపింది. ఇది NASAకు చెందిన మారినర్ 9 అంతరిక్ష నౌక మొదటిసారిగా గుర్తించిన పెద్ద షీల్డ్ అగ్నిపర్వతంగా చెబుతారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.