రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నాయకులు.. కదిలొచ్చిన అధికారులు

by Dishafeatures2 |
రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నాయకులు.. కదిలొచ్చిన అధికారులు
X

దిశ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతాంగల్ చెక్ పోస్ట్ వద్ద హెగ్డోలి గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపుల మొరం వేయాలని బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కాపు గాండ్ల శ్రీను మాట్లాడుతూ.. హెగ్డోలి గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డు వేసి మూడు సంవత్సరాలు గడిచిన ఇంత వరకు రోడ్డు ఇరువైపులా మొరం వేయకపోవడంతో నిత్యం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఇరవై రోజుల క్రితం ఎంపీడీఓ అత్తరుద్దీన్‌కు ఈ విషయంపై వినతి పత్రం అందించామని, కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగిందని, ఇప్పటికయినా అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా మొరం వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, నాగం సాయి, గురునాథ్, మామిడి శ్రీను, పబ్బా శేఖర్, శివ చరణ్, సాయినాథ్, భజరంగ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హామీ ఇచ్చిన ఎంపీడీఓ

రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నాయకులను సముదాయించేందుకు ఎంపీడీఓ స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో మాట్లాడుతూ.. హెగ్డోలి గ్రామానికి వెళ్లే రోడ్డుకు రెండు రోజుల్లో ఇరువైపులా మొరం వేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీడీఓ హావీ అనంతరం బీజేపీ నాయకులు ధర్నా విరమించుకున్నారు.


Next Story

Most Viewed