ఆ లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: చంద్రుపట్ల సునిల్ రెడ్డి

by Web Desk |
ఆ లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: చంద్రుపట్ల సునిల్ రెడ్డి
X

దిశ, మంథని: అర్హులకు కాకుండా అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ తరపున పోరాడతామని బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. గురువారం మంథనిలో పోచమ్మవాడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పులకు పేద ప్రజలు బలై పోతున్నారన్నారు. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రస్తుత జడ్పీ చైర్మన్ గా ప్రజాప్రతినిధులుగా పని చేస్తూ కూడా ఏమాత్రం పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా సొంత మనుషులకు, టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చే విధంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు.

మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామ్ రెడ్డి హయాంలో సర్వే నెంబర్ 1520 లో 10 ఎకరాల భూమిని తీసుకొని ప్లాంటింగ్ చేసి పోచమ్మ వాడ పేదలకు ఇవ్వాలని సంకల్పించారు. అప్పటి నుంచి ఈ ఫ్లాట్ల ఈ విషయంలో రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయని ఏ ప్రజా ప్రతినిధి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు నిజమైన, అర్హులైన, పేద ప్రజలకు చెందే వరకు ఈ పోరాటం ఆగబోదని బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంథని పట్టణ అధ్యక్షుడు ఎడ్ల సదాశివ్, ప్రధాన కార్యదర్శి సబ్బని సంతోష్, నాయకులు సత్య ప్రకాష్, నాంపల్లి రమేష్, బోగోజు శ్రీనివాస్, కోరబోయిన మల్లికార్జున్, రాపర్తి సంతోష్, పోతారా వేణి క్రాంతి కుమార్, సాగర్ ఎడ్ల, చిట్టావేని హరీష్, కాసర్ల సూర్య పాల్గొన్నారు.



Next Story

Most Viewed