ఎలక్ట్రిక్ వాహనాల కోసం జత కడుతున్న కంపెనీలు

by Disha Web Desk 17 |
ఎలక్ట్రిక్ వాహనాల కోసం జత కడుతున్న కంపెనీలు
X

దిశ,వెబ్‌డెస్క్: బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ బౌన్స్, గ్రీవ్స్ రిటైల్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల (EVల)డెలివరీలను వేగవంతం చేయడానికి, ఆటో తయారీదారులు, ఇంధన కంపెనీలు, స్టార్టప్‌లు అభివృద్ధి చెందుతున్న బ్యాటరీ-స్వాప్ మార్కెట్‌లో ఫాస్ట్-ట్రాకింగ్ వ్యవస్థ ఎర్పాటు చేయడానికి ఇలాంటి భాగస్వామ్యాలు ఎంతగానో ఉపయోగపడుతాయని నిపుణులు తెలిపారు. "ఇది మరింత మంది భారతీయులకు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS)తో సరసమైన మొబిలిటీని పొందేందుకు వీలు కల్పిస్తుంది" అని బౌన్స్ కో ఫౌండర్ CEO వివేకానంద హల్లెకెరే అన్నారు. కంపెనీ 200 కంటే ఎక్కువ స్వాపింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. డిసెంబర్ 2021లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ఫినిటీ E1ని విడుదల చేసినట్లు బౌన్స్ తెలిపింది.

"బ్యాటరీల రీఛార్జ్ కోసం ఎదురుచూడకుండా రైడర్లు తమ బైక్‌లను నడపడానికి వీలుగా స్వాపింగ్ స్టేషన్‌లను పని ప్రదేశాలలో ఉంచడం వల్ల రైడర్లకు బాగా ఉపయోగపడుతుందని" హీరో ఎలక్ట్రిక్ CEO సోహిందర్ గిల్ అన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఢిల్లీ ప్రభుత్వం బస్ డిపోలలో ఎలక్ట్రిక్ టూ, త్రీ, ఫోర్-వీలర్ల కోసం బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL)తో ఒప్పందం కుదుర్చుకుంది. హోండా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్‌లెట్లలో బ్యాటరీ-స్వాప్ స్టేషన్ల కోసం భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించాయి.



Next Story