మద్యం సేవించి వాహనాలు నడిపితే కుటుంబాలు రోడ్డున పడతాయి: ఏఎస్పీ రోహిత్ రాజు

by Dishanational1 |
మద్యం సేవించి వాహనాలు నడిపితే కుటుంబాలు రోడ్డున పడతాయి: ఏఎస్పీ రోహిత్ రాజు
X

దిశ, భద్రాచలం టౌన్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు కోరారు. బుధవారం స్థానిక సీతారామ ఆఫీసర్స్ క్లబ్ నందు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. మణుగూరు, అశ్వాపురం, బూర్గం పాడు, భద్రాచలం మండలాలకు చెందిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినవారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని వివరించారు. అంతేకాదు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. డ్రైవింగ్ లైసెన్సు, ఇన్స్యూరెన్స్ కలిగి ఉండాలన్నారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదన్నారు. పెండింగ్ ఈ- చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed