సీఎం కేసీఆర్ దానికి సమాధానం చెప్పాలి: రాష్ట్ర సర్కార్‌పై ఎబీవీపీ ఫైర్

by Disha Web Desk 19 |
సీఎం కేసీఆర్ దానికి సమాధానం చెప్పాలి: రాష్ట్ర సర్కార్‌పై ఎబీవీపీ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, వెళ్ళూనుకుపోయిన డ్రగ్స్ మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన ప్రభుత్వం నియంత్రించడంలో ఫెయిలైందని ఏబీవీపీ నాయకులు బుధవారం ఒక ప్రకటనలో ఫైరయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీస్​నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటే డ్రగ్స్ దందా ఎలా కొనసాగుతోందో ముఖ్యమంత్రి కేసీఆర్​సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ప్రత్యేక నిఘా బృందాల ద్వారా కూకటివేళ్ళతో పెకిలిస్తామని సీఎం ప్రకటించిన కొద్దిరోజులకే నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్ రాడిసన్ హోటల్ పబ్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ పట్టుబడటమేంటని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్​రెడ్డి ప్రశ్నించారు.

పలు కార్పొరేట్​విద్యాసంస్థలకు చెందినవారే ఎక్కువ మంది ఈ విష సంస్కృతికి అలవాటుపడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం, పోలీస్​వ్యవస్థలోని లోపాలను అదునుగా చూసుకుని డ్రగ్స్ మాఫియా పంజా విసురుతోందన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో అధికారులు, ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఫైరయ్యారు. పోలీస్ అధికారులు కూడా తూతూ మంత్రంగా రెయిడ్స్​చేపట్టి చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. రాడిసన్ బ్లూ డ్రగ్స్​వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారుల జాబితాను బయటపెట్టాలని ఆయన డిమాండ్​చేశారు.

Next Story

Most Viewed