'రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులకు ప్రత్యేక ప్యాకేజీ పెట్టాలి..'

by Disha Web |
రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులకు ప్రత్యేక ప్యాకేజీ పెట్టాలి..
X

దిశ, ఇందల్వాయి : అసెంబ్లీ బడ్జెట్‌లో వికలాంగులకు ప్రత్యేక ప్యాకేజీ పెట్టాలని నిజామాబాద్ రూరల్ కన్వీనర్ కుంట మహిపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం ఇందల్వాయి మండల కేంద్రంలో సాయిబాబా ఆలయంలో వికలాంగుల సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వికలాంగుల పట్ల వివక్ష చూపడం సరి కాదని.. వెంటనే అసెంబ్లీలో వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని కోరారు.

అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టిన పథకాలలో వికలాంగులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అలాగే రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సమస్యలపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించి మాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా మా కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని, ఆర్థికంగా ఎదగడానికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వికలాంగుల అధ్యక్షుడు గంగారం, మండల మహిళా వికలాంగుల అధ్యక్షురాలు అబ్బావ్వ, వికలాంగులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed