ప్రతీ అవసరానికి సోలార్‌ పవర్‌ వాడకం.. ఆదర్శంగా కర్నాటక వ్యక్తి

by Disha Web Desk |
ప్రతీ అవసరానికి సోలార్‌ పవర్‌ వాడకం.. ఆదర్శంగా కర్నాటక వ్యక్తి
X

దిశ, ఫీచర్స్ : కర్నాటకలోని హుబ్బళ్లి నగరానికి చెందిన ఆర్కిటెక్ట్ కమ్ సోలార్ మ్యాన్ 'సంజయ్ దేశ్‌పాండే'.. తన ప్రతి అవసరాన్ని సౌరశక్తితో తీర్చుకోవడంలో నైపుణ్యం పొందారు. ఈ క్రమంలో డబ్బును ఆదా చేయడమే కాక పర్యావరణానికి మేలు చేస్తున్నాడు. అతని ఇంటి అవసరాలకు సౌరశక్తితో నడిచే పంపులను ఏర్పాటు చేసుకున్న సంజయ్.. ఆఫీస్‌కు వెళ్లేందుకు ఎలక్ట్రిక్ కారునే ఉపయోగిస్తున్నాడు. గతంలో గృహావసరాలే కాక వెహికల్ ఫ్యూయల్ కోసం సుమారు రూ. 18,000 ఖర్చుచేసిన తను ఇప్పుడు ఆ డబ్బును ఆదా చేస్తున్నాడు.

ఈ ఆలోచన ఎలా వచ్చింది

ఇంటి రక్షణకు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో పాటు రాత్రంతా ఫ్యాన్లు, లైట్ల కోసం విద్యుత్‌ ఉత్పత్తికి కిటికీ బయట సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయమని మా నాన్న ఫ్రెండ్ సలహా ఇచ్చారు. దీంతో 'గతేడాది ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశాను. సగటున 4.2 kW సౌరశక్తిని ఉత్పత్తి చేసే సౌర వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నాకు అనుమతి లభించింది. నా గృహ అవసరాలు తీర్చుకున్నాక మిగిలిన విద్యత్‌ను హుబ్బళ్లి విద్యుత్ సరఫరా కంపెనీ(Hescom)కి సరఫరా చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి నెల అదనంగా రూ. 500 నుంచి రూ. 1,000 వరకు పొందగలుగుతున్నాను' అని సంజయ్ చెప్పాడు.


సంజయ్ వద్ద రెండు ఎలక్ట్రిక్ వాహనాలు, హౌస్‌హోల్డ్ మిషన్స్, టెర్రస్ గార్డెన్‌కు నీరు పెట్టడానికి పంపులు, ఫౌంటైన్స్ ఉన్నాయి. సాధారణంగా మూడు రకాలుగా 'మోనోక్రిస్టలైన్, పాలీక్రిస్టలైన్, థిన్-ఫిల్మ్'గా లభిస్తున్న సోలార్ ప్యానెల్స్‌లో అతను మోనోక్రిస్టలైన్ ప్యానెల్స్ ఏర్పాటు చేశాడు. ఇవి వర్షాల సమయంలోనూ అత్యంత ప్రభావవంతంగా ఉండటంతో పాటు 60 శాతానికి పైగా శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

Next Story

Most Viewed