ప్రాజెక్టుల నిధుల్లో 95% వినియోగం దానికే.. వెల్లడించిన కాగ్ నివేదిక

by Disha Web |
ప్రాజెక్టుల నిధుల్లో 95% వినియోగం దానికే.. వెల్లడించిన కాగ్ నివేదిక
X

రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు కేటాయించే నిధుల్లో 95 శాతం కరెంటు బిల్లులకే ఖర్చవుతున్నాయని కాగ్ నివేదిక పేర్కొన్నది. ఎంజీకేఎల్ఐ, దేవాదుల, శ్రీశైలం ఎడమగట్టు కాల్వకు, భీమా ఎత్తిపోతల పథకానికి చేసిన చెల్లింపును ఉదహరించింది. చిన్నపద్దుల కింద రూ. 1492.24 కోట్లు బడ్జెట్​లో కేటాయించారని, చిన్న పనులేమీ చేయకుండా రూ. 1644.34 కోట్లను విద్యుత్​ బిల్లులకు చెల్లించారని కాగ్​ తప్పు పట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో : పలు ప్రాజెక్టుల చిన్న పనుల కోసం చేసే కేటాయింపుల్లో 95% విద్యుత్​ ఛార్జీలకే చెల్లించాల్సి వస్తున్నది. చిన్న పనులు అంటూ కేపిటల్​వ్యయంగా పరిగణిస్తున్నారని, వాటితో చేసే పనులు ఏమీ లేవని కాగ్​ నివేదిక వెల్లడించింది. 4 ప్రాజెక్టులను ఉదహరించిన కాగ్​.. 95% విద్యుత్​ బిల్లులు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్​లో పలు ప్రాజెక్టులకు కాల్వల తవ్వకం, మరమ్మతులు, నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా రూ. 22 వేల కోట్లను బడ్జెట్​లో పేర్కొన్నారు. వీటిని ఆయా ప్రాజెక్టుల పరిధిలో నీటి సరఫరా పనులకు వాడుకోవాల్సి ఉంది. మిగిలిన పనులను అప్పు రూపంలో ఆయా కార్పొరేషన్ల నుంచి సమీకరించుకుంటున్నది. అయితే, ప్రభుత్వం బడ్జెట్​లో కేటాయించే నిధుల్లో అధిక భాగం విద్యుత్​ ఛార్జీలకే చెల్లించాల్సి వస్తున్నదని పేర్కొన్నది.

పాక్షికంగానే ప్రయోజనం

ఎత్తిపోతల పథకాలకు భారీ స్థాయిలో కరెంట్​ వినియోగం చేస్తున్నారని, ఈ ప్రాజెక్టుల నుంచి ప్రయోజనం పాక్షికంగానే ఉంటుందని వెల్లడించింది. ప్రభుత్వం ఈ కేటాయింపులను క్యాపిటల్​ వ్యయానికి బదులుగా రెవెన్యూ ఖర్చులుగా మార్చుకోవాల్సి ఉందని సూచించింది. 2020 మార్చి వరకు గుర్తించిన ప్రకారం కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ. 642.28 కోట్లు, దేవాదుల లిఫ్ట్ కు రూ. 423.53 కోట్లు, శ్రీశైలం ఎడమగట్టు కాల్వకు రూ. 333.35 కోట్లు, రాజీవ్​ భీమా ఎత్తిపోతలకు రూ. 108.04 కోట్లు విద్యుత్​ బిల్లుల కింద చెల్లించినట్టు తెలిపింది. వీటి కోసం చిన్న పనుల పద్దు కింద రూ. 1492.24 కోట్లు బడ్జెట్​లో కేటాయించారని, చిన్న పనులేమీ చేయకుండా రూ. 1644.34 కోట్లను విద్యుత్​ బిల్లులకు చెల్లించారని కాగ్​ తప్పు పట్టింది.



Next Story

Most Viewed