ఆటోను ఢీకొన్న మినీ ఆటో.. ఈ ప్రమాదంలో ముగ్గురూ..

by Gopi |
ఆటోను ఢీకొన్న మినీ ఆటో.. ఈ ప్రమాదంలో ముగ్గురూ..
X

దిశ, అడ్డాకుల: జాతీయ రహదారి నెం. 44పై గురువారం ఓ ఆటోను మినీ ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలుయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బల్లీదుపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ బాలకృష్ణ కొత్తకోట నుండి ప్యాసింజర్స్ ను తీసుకుని వెళ్తున్న క్రమంలో.. వెనక నుండి అతి వేగంగా వచ్చిన మినీ ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆ ఆటో బోల్తా పడింది. అందులో ఉన్న తెలుగు కృష్ణయ్య, మందడి జ్యోతి, సింగి మమత, నడిమింటి వెంకటేశ్, నడిమింటి పద్మ ఆటో డ్రైవర్ బాలకృష్ణకు గాయాలయ్యాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed