1975 ఏప్రిల్ 4.. 'మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్' స్థాపన

by Disha Web Desk 12 |
1975 ఏప్రిల్ 4.. మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్ స్థాపన
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పేరు గాంచిన 'మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్(MSFT)'ను అమెరికాకు చెందిన ఇద్దరు మిత్రులు బిల్ గేట్స్, పౌల్‌ అలెన్‌ 1975 ఏప్రిల్ 4న స్థాపించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వాషింగ్టన్‌, రెడ్మాండ్‌ నగరాల్లో ప్రధాన కార్యాలయం కలిగిన మైక్రోసాఫ్ట్.. వివిధ రకాల కంప్యూటర్ పరికరాల తయారీతో పాటు సాఫ్ట్‌వేర్స్‌ను అభివృద్ధిచేస్తోంది. అంతేకాదు ఇతర సంస్థలకు లైసెన్స్‌లు ఇస్తూ సహాయ సహకారాలు అందిస్తోంది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్లను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా ఉన్న అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్న ఈ సంస్థలో సుమారు 57,000 మంది ఉద్యోగులున్నారు.



Next Story

Most Viewed