ఆ సముద్ర చేప కనిపించేసింది.. భూకంపాలు ఖాయం..?

by Dishanational1 |
ఆ సముద్ర చేప కనిపించేసింది.. భూకంపాలు ఖాయం..?
X

దిశ, ఫీచర్స్ : మనకు తెలియని ఎన్నో రకాల వింత జీవులు సముద్ర గర్భంలో నివసిస్తున్నాయి. అయితే ఒక్కోసారి అరుదుగా కనిపించే, వింతైన సముద్ర జీవులను చూస్తే ఒళ్లు గగుర్లుపొడుస్తుంది. ప్రస్తుతం అలాంటిదే 16 అడుగుల సముద్ర ఫిష్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఫిష్ కనిపిస్తే ఏదో ఒక అపాయం జరుగుతుందని కూడా నమ్ముతుండగా.. దీని విశేషాలు తెలుసుకుందాం.

చిలీలోని మత్స్యకారుల బృందం 16 అడుగుల పొడవైన సముద్ర రాక్షస చేపను పట్టుకున్నారు. అయితే ఈ ఫిష్‌ను 'ఓర్ ఫిష్' అని కూడా పిలుస్తారు. అయితే ఇది కనిపిస్తే కీడు జరగబోతోందని నమ్మే స్థానికులు.. సునామీ, భూకంపాలు వస్తాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా 2011 తర్వాత జపాన్‌లో ఘోరమైన ఫుకుషిమా భూకంపానికి ముందు డజన్ల కొద్దీ జీవులు కనిపించాయి. ఈ కారణంగా.. ఈ జీవి భూకంపాలను తెస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఎక్కువగా సముద్రపు అడుగు భాగాన జీవించే చేపలు.. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, బ్రీడింగ్ సమయంతోపాటు చనిపోయాక నీటి పైకి తేలుతాయని నిపుణులు వివరించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.



Next Story