నాకు ఇళ్లు లేకుండా చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
నాకు ఇళ్లు లేకుండా చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లాలో శుక్రవారం రాహుల్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఇంత ఎండలో మీటింగ్‌కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ ఎన్నిక నియంత్రత్వ దొరల పాలనకు, ప్రజలకు మధ్య జరుగుతుందని అన్నారు. తెలంగాణలో నియంత్రత్వ దొరల పాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రజల పోరాటం వలన వచ్చిన తెలంగాణలో రాచరిక పాలన ఏర్పడింది. అన్ని రేట్లు పెరిగాయి. అన్ని రకాల దందాలు, అన్ని మాఫియా పెరిగాయి. రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బంధీ అయిపోయింది.

రాష్ట్రాన్ని దోచుకొని జేబులు నింపుకుంటున్నారుని కేసీఆర్ ఫ్యామిలీపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజాం చెక్కర ఫ్యాక్టరీ ప్రభుత్వం ముసివేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. పసుపు మద్దతు ధరను రూ.12 నుండి రూ. 15 వేలకు పెంచుతామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటికీ అదనంగా రూ.500 పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలపై తమకు ప్రేమ ఉందని.. ఈ ప్రేమ కేవలం ఇప్పుడు వచ్చింది కాదు.. గాంధీ కుటుంబంతో ముందు నుంచీ ఉందని చెప్పారు. తెలంగాణకు వచ్చేప్పుడు మా సోదరి(ప్రియాంక గాంధీ) కూడా ఆహ్వానించాను. మళ్ళీ త్వరలో ప్రియాంక కూడా వస్తుంది. రాజకీయ అనుబంధమే కాదు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది.

జగిత్యాలకు రావడం చాలా సంతోషం ఉందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని విమర్శించారు. ఢిల్లీలో ఈ రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్.. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీజేపీకి మద్దతు ఇస్తుందని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే నాపై కేసులు పెట్టారు. పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించారు. నాకు ఇళ్లు లేకుండా చేశారు. దేశమే నా ఇళ్లు. నా ఇళ్లు తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో ఉందని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేసినా ఎమ్ఐఎమ్ అక్కడ పోటీ చేసి పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తోందని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో బలహీన వర్గాలకు సంబంధించి కుల గనన చేపట్టాలని డిమాండ్ చేశాను.. కానీ ప్రధాని నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.

Read More..

రూ.50 కోట్లకు పీసీసీ పదవి కొన్నాడని కోమటిరెడ్డి చెప్పారు: KTR



Next Story

Most Viewed