యాదాద్రి రోడ్ షోలో కేటీఆర్ బూతు పురాణం (వీడియో)

by GSrikanth |
యాదాద్రి రోడ్ షోలో కేటీఆర్ బూతు పురాణం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: విపక్ష నేతలను మంత్రి కేటీఆర్ బండ బూతులు తిట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లాను చేసి అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నది కేసీఆర్ కాదా? అని అడిగారు. ‘55 ఏళ్లు అధికారంలో ఉన్న చెత్తనా కొడుకులతో ఏం అభివృద్ధి జరిగింది’ అని కాంగ్రెస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భువనగిరిలో శేఖర్ రెడ్డిని గెలిపిస్తే మిగిలిపోయిన పనులన్నీ జరుపుకొని యాదాద్రిని సస్యశ్యామలం చేసుకుందామని పిలపునిచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎక్కడ? ఇంటికో ఉద్యోగం ఎక్కడా? కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడా? అంటూ కొందరు వ్యక్తులు రోడ్ షోలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘‘ఆ సన్నాసులు అడుగుతున్నారు.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని. 55 ఏళ్లు పరిపాలించిన చెత్త నా కొడుకులు ఏం పీకారు. ఇజ్జత్ మానం లేదు అడగటానికి. 55 ఏళ్లు పరిపాలించిన చెత్త నా కొడుకులు ఇవాళ వచ్చి ఇది లేకపాయే.. అది లేకపాయే అంటే వీపు పగుల కొట్టే వాళ్లు లేకనా.. మీ యాదాద్రిని జిల్లా చేసింది ఎవరు..? కేసీఆరేనా.. మరి చెత్త నా కొడుకులకు అయిందా 55 ఏళ్లలా. సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. 55 ఏళ్లలా కరెంట్ ఇచ్చిన కొడుకులా వీళ్లు.. తాగునీళ్లు ఇచ్చిర్రా. సాగు నీరు ఇచ్చిర్రా. రైతుబంధు ఇచ్చిర్రా. కేసీఆర్ కిట్టిచ్చిర్రా. డిగ్రీ కాలేజ్ తెచ్చిర్రా. వలిగొండలో ఇవ్వి అడిగితే వీపు పగులకొట్టి పంపించాలే. 30వ తారీకు నాడు ఎవడు అడ్డం వచ్చిన తొక్కుకుంటూ పోవుడే’’ అంటూ కేటీఆర్ తీవ్ర అసహనంతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి తీవ్ర పదజాలాన్ని వాడారు. ప్రస్తుతం కేటీఆర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed