గోరటి వెంకన్న కళాకారులకు మచ్చలా మారారు: కాంగ్రెస్

by Disha Web Desk 2 |
గోరటి వెంకన్న కళాకారులకు మచ్చలా మారారు: కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా నిర్మించిన అమరవీరుల స్థూపం వద్ద మంత్రి కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూకి పోలీసులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ప్రశ్నించారు. గురువారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్, గోరెటి వెంకన్నను ఇంటర్వ్యూ చేసే క్రమంలో అంబేడ్కర్ విగ్రహం కనపడేలా షూటింగ్ చేశారని, కొత్త సచివాలయం వద్ద డ్రోన్‌లతో కూడా షూట్ చేసారని, ఇందుకోసం డ్రోన్‌కు అనుమతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

ఈ ఇంటర్వ్యూపై ఎలక్షన్ కమిషన్ విచారణ జరపాలని ఆయన భారత ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. గోరేటి వెంకన్న కేసీఆర్‌కి తొత్తులా పని చేస్తున్నారని, కవులు, కళాకారులకి గోరెటి వెంకన్న ఒక మచ్చలా మారారని ఆరోపించారు. అధికార పార్టీకి ఇచ్చిన విధంగా తమకు అనుమతి ఇస్తే కాంగ్రెస్‌కి కూడా అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తుందని తెలిపారు. సెర్చ్ వారంట్ లేకుండా మధుయాష్కీ నివాసంలో ఏ విధంగా పోలీసులు తనిఖీలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. పాతబస్తీలో పోలీసులు మజ్లిస్‌కి తొత్తులా పని చేస్తున్నారని విమర్శించారు.



Next Story

Most Viewed