శుభవార్త: ఆడపిల్లల పేరుమీద రూ.2 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

by Disha Web Desk 2 |
శుభవార్త: ఆడపిల్లల పేరుమీద రూ.2 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 1200 మంది యువత బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరవలేదని, మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రం ఈ పదేళ్లలో దివాలా తీసిందని మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. భూముల వేలంలో రూ. 4 వేల కోట్ల అవినీతి జరిగిందని, ఔటర్ రింగ్ రోడ్డు లీజు వేలంలోనూ భారీగా అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ ప్రభత్వంలో ఉద్యోగ పరీక్షల పేపర్ లీక్‌లు జరిగాయని, ఉద్యోగాల భర్తీ, లక్ష రుణమాఫి చేయలేదు. నిరుద్యోగ భృతి అమలుకు నోచుకోలేదు, ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల హామీలు అమలు కాలేదు అని విమర్శించారు. సెప్టెంబర్ 17 నిర్వహణపై ఇచ్చిన మాట తప్పారన్నారు.


కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఎంఐఎంకు భయపడి ముస్లిం రిజర్వేషన్లు కల్పించారని, బీజేపీ అధికారలోకి వస్తే.. ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు మేం రద్దు చేసి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయమైన రిజర్వేషన్ తీసుకొస్తామన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ తీర్చిందన్నారు. పెట్రోల్, డీజీల్ వ్యాట్ తగ్గిస్తామని హామీలు ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వరి ధాన్యం క్వింటాల్ రూ. 3100 ధర చెల్లిస్తామని అన్నారు. ఆడపిల్లల పేరు మీద రూ.2 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని వరాల జల్లు కురిపించారు. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed