తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల.. 52 మందితో జాబితా

by GSrikanth |
తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల.. 52 మందితో జాబితా
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత హైకమాండ్ విడుదల చేసింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ అర్వింద్ వంటి అగ్రనేతలందరి పేర్లు ఫస్ట్ లిస్ట్‌లోనే ప్రకటించారు. ఈటల రాజేందర్ హుజురాబాద్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తోన్న గజ్వేల్ నియోజకవర్గం నుంచీ ఈటల బరిలోకి దిగారు. దీంతో ఈసారి ఈటల రెండు చోట్ల పోటీ చేయడం ఖరారైంది. కాగా, మొదటి లిస్టులో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, విజయశాంతి, డీకే అరుణ పేర్లు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే బీఆర్ఎస్‌ 119 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఆ 55 మంది అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ఇవాళ బీజేపీ సైతం 52 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడంతో రాజకీయం రంజుగా మారింది. రేపటి నుంచి రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనుంది.

బీజేపీ ఫస్ట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు వీరే... :

ఆదిలాబాద్ జిల్లా :

1. సిర్పూర్ - పాల్వాయి హరీశ్

2. బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి

3. ఖానాపూర్ (ఎస్టీ) – రమేశ్ రాథోడ్

4. ఆదిలాబాద్ – పాయల్ శంకర్

5. బోధ్ (ఎస్టీ) - సోయం బాపూరావ్

6. నిర్మల్ - ఏలేటి మహేశ్వర్ రెడ్డి

7. ముథోల్ - రామారావు పటేల్

నిజామాబాద్ జిల్లా :

1. ఆర్మూరు - పైడి రాకేశ్ రెడ్డి

2. జుక్కల్ (ఎస్సీ) - అరుణతార

3. కామారెడ్డి - కాటేపల్లి వెంకట రమణారెడ్డి

4. నిజామాబాద్ అర్బన్ - ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

5. బాల్కొండ – ఏలేటి అన్నపూర్ణమ్మ

కరీంనగర్ జిల్లా

1. కోరుట్ల - ధర్మపురి అరవింద్

2. జగిత్యాల – డాక్టర్ భోగ శ్రావణి

3. ధర్మపురి (ఎస్సీ) – ఎస్. కుమార్

4. రామగుండం - కందుల సంధ్యారాణి

5. కరీంనగర్ - బండి సంజయ్

6. సిరిసిల్ల – రాణి రుద్రమరెడ్డి

7. చొప్పదండి (ఎస్సీ) - బొడిగె శోభ

8. మానకొండూరు - ఆరేపల్లి మోహన్

9. హుజూరాబాద్ - ఈటల రాజేందర్

వరంగల్ జిల్లా :

1. జనగాం – డా. ఆరుట్ల దశ్‌మంత్ రెడ్డి

2. స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) – డా. గుండె విజయ రామారావ్

3. పాలకుర్తి – లేగా రామ్‌మోహన్ రెడ్డి

4. డోర్నకల్ (ఎస్టీ) – భూక్యా సంగీత

5. మహబూబాబాద్ (ఎస్టీ) – జాటోత్ హుస్సేన్ నాయక్

6. వరంగల్ వెస్ట్ – రావ్ పద్మ

7. వరంగల్ ఈస్ట్ - ఎర్రబెల్లి ప్రదీప్ రావ్

8. వర్ధన్నపేట్ (ఎస్సీ) – కొండేటి శ్రీధర్

9. భూపాలపల్లి – చందుపట్ల కీర్తి రెడ్డి

10. ఇల్లెందు (ఎస్టీ) – రవీంద్రనాయక్

11. భద్రాచలం (ఎస్టీ) – కుంజ ధర్మారావ్

మెదక్ జిల్లా :

1. నర్సాపూర్ – ఎర్రగోళ్ళ మురళీ యాదవ్

2. పటాన్‌చెరు – నందీశ్వర్ గౌడ్

3. దుబ్బాక - రఘునందన్ రావు

4. గజ్వేల్ - ఈటల రాజేందర్

రంగారెడ్డి జిల్లా :

1. కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్

2. ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్

3. మహేశ్వరం - అందెల శ్రీరాములు

హైదరాబాద్ :

1. ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి

2. కార్వాన్ – అమర్ సింగ్

3. గోషామహల్ - రాజాసింగ్

4. చార్మినార్ – మేఘారాణి

5. చాంద్రాయణ్‌గుట్ట – సత్యనారాయణ ముదిరాజ్

6. యాకుత్‌పుర – వీరేందర్ యాదవ్

7. బహదూర్‌పుర – నరేశ్ కుమార్

మహబూబ్‌నగర్ జిల్లా :

1. కల్వకుర్తి - తల్లోజు ఆచారి

2. కొల్లాపూర్ – ఎల్లేని సుధాకర్ రావ్

నల్లగొండ జిల్లా :

1. నాగార్జున సాగర్ – కంకనాల నివేదితా రెడ్డి

2. సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వరరావు

3. భువనగిరి – గూడూరు నారాయణరెడ్డి

4. తుంగతుర్తి (ఎస్సీ) – కడియం రామచంద్రయ్య







Next Story

Most Viewed