కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు నిన్న బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రియాక్ట్ అయ్యారు. మండల పార్టీ అధ్యక్షుల నియామకం సంస్థాగత నిర్ణయం అన్నారు. దాంట్లో తాను చేసేది ఏం ఉండదన్నారు. ఇక కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ జై కొట్టడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగతనం బయటపడిందన్నారు. ఆయుష్మాన్ భారత్‌లో చేరకుండా

కేసీఆర్ తెలంగాణ పేదలకు రూ.35 లక్షల కోట్లనష్టం వాటిళ్లేలా చేసాడన్నారు. బడ్జెట్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రూ.30వేల కోట్లు కేటాయించి మూడు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని ఫైర్ అయ్యారు. పైసలన్నీ కాళేశ్వరంలో ముంచుడు, కవితకు ఇచ్చుడు అన్నట్లు కేసీఆర్ వ్యవహారిస్తున్నాడని మండిపడ్డారు.

9 ఏళ్లలో పంట నష్టానికి ఒక్కరూపాయి ఇయ్యలేదన్నారు. కేసీఆర్ ఎన్ఆర్ఐలను తడిగుడ్డతో గొంతుకోసాడన్నారు. 18 గంటలు పనిచేసే ప్రధానిపై ఫార్మ్ హౌస్‌లో పండుకునే కేసీఆర్ అవిశ్వాసం పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బీ టీం కాదని, కాంగ్రెస్ ఏ1, బీఆర్ఎస్ ఏ2, ఎంఐఎం ఏ3 అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంటే కాంగ్రెస్ స్టీరింగ్ బీఆర్ఎస్ చేతిలో ఉందన్నారు. కడెం ప్రాజెక్టు గతేడాది ఏ స్టేజీలో ఉందో ఇప్పుడు అలాగే ఉందన్నారు. ఇన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసినట్లు అని ప్రశ్నించారు. రైలు ప్రమాదం జరిగితే ప్రధాని సందర్శించారని, రైల్వే శాఖ మంత్రి అక్కడే ఉండి రైలు ప్రయాణాలు మొదలైయ్యేదాకా పర్యవేక్షించారన్నారు. కానీ వర్షాలతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఫార్మ్ హౌస్‌లో పండుకున్నాడన్నారు.


Next Story