బుజ్జగింపులు స్టార్ట్.. Vemula Veeresham నిర్ణయంపై ఉత్కంఠ

by Disha Web Desk 2 |
బుజ్జగింపులు స్టార్ట్.. Vemula Veeresham నిర్ణయంపై ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్‌లో దాదాపు సిట్టింగులకే టికెట్ ఖరారు చేయడంతో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న నియోజకవర్గాల కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా నకిరేకల్ నేత, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన చిరుమర్తి లింగయ్యకే టికెట్ ఖరారు చేయడంతో పక్క చూపులు చూస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధిష్టానం బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని జిల్లాలోని పార్టీ సీనియర్లు వీరేశంను బుజ్జగిస్తున్నారు.

కాగా, ఇప్పటికే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జిల్లా పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సైతం కలిసి మంతనాలు జరిపినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓటమి చెంది ఐదేళ్లు ఖాళీగా ఉన్న వీరేశానికి ఈ ఎన్నికలు వీరేశంకు కీలకం కానున్నాయి. దీంతో ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తు్న్నారని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే నకిరేకల్ కాంగ్రెస్ టికెట్ ఆశించి మునుగోడు బైపోల్ సమయంలో కాంగ్రెస్‌లో చేరిన చెరుకు సుధాకర్‌కు భువనగిరి నుంచి లేదా ఆలేరు నుంచి అవకాశం కల్పించే ఛాన్స్ ఉండటంతో వీరేశం దూకుడు పెంచినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. దీనిని గమనించిన బీఆర్ఎస్ అధిష్టానం వేముల వీరేశంను బుజ్జగిస్తున్నారు. ఎన్నికలకు మూడు నెలలే సమయం ఉండటంతో వీరేశం నిర్ణయంపై జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed