వట్టే జానయ్యపై హత్యాయత్నం.. గొడ్డళ్లతో అర్ధరాత్రి అటాక్ (వీడియో)

by Disha Web Desk 2 |
వట్టే జానయ్యపై హత్యాయత్నం.. గొడ్డళ్లతో అర్ధరాత్రి అటాక్ (వీడియో)
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్యపై హత్యాయత్నం జరిగింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్లు గ్రామంలో ఆదివారం రాత్రి వట్టే జానయ్య ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వర్గం అనూహ్యంగా ఆయనపై వేట కొడవళ్లు, కొడ్డళ్లతో భయంకరంగా దాడి చేయండంతో పాటు హత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ఆయన అనుచరులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. సూర్యాపేట అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరులు, బంధువులే ఈ దాడికి పాల్పడ్డారని బీఎస్పీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. హత్యాయత్నం విషయంపై పోలీసుల సంప్రదించగా.. వారు సైతం కేసు నమోదు చేయడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. వట్టే జానయ్య అనుచరులు, బీఎస్పీ శ్రేణులు జిల్లా ఎస్పీ వచ్చేవరకు ఇక్కడి నుంచి కదలబోమని రోడ్డుపై బైటాయించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దాడి వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://youtu.be/6_న్వెజ్౮౧తౌ

https://youtube.com/shorts/7XlgjLK0XRk



Next Story

Most Viewed