కాంగ్రెస్ పార్టీలో ఆ సర్వే ప్రకంపనలు.. గెలుపు గుర్రాలపై స్పెషెల్ స్ట్రాటజీ!

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ పార్టీలో ఆ సర్వే ప్రకంపనలు.. గెలుపు గుర్రాలపై స్పెషెల్ స్ట్రాటజీ!
X

కాంగ్రెస్‌లో మా కన్నా సీనియర్లు ఎవరున్నారు? టికెట్​మాకే అనుకున్న నేతలందరూ ఇప్పుడు టెన్షన్​పడుతున్నారు. పార్టీ వ్యూహకర్త సునీల్​ కనుగోల్​టీమ్ చేపట్టిన ‘పాపులర్​’ సర్వేలో గెలుపు కచ్చితం అని తేలిన వారికే టికెట్లు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నది. దీంతో నేతల సీనియారిటీ, స్థాయి అంశాలేవీ టికెట్​విషయంలో పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదు. గతంలో సునీల్ టీమ్​చేసిన కాన్‌స్టిట్యూయెన్సీ సర్వే, క్యాండిడేట్ సర్వే, తాజాగా చేసిన పాపులర్ సర్వే.. ఇవే అభ్యర్థుల ఎంపికకు క్రైటీరియాగా మారనున్నాయి. ఇదే సమయంలో రాహుల్​గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన మరో సర్వే నివేదికతో సునీల్​ రిపోర్ట్​ను పోల్చుకుంటూ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఏఐసీసీ బిజీగా ఉన్నది. ఈ క్రమంలోనే టికెట్​కావాలని డిమాండ్​చేస్తున్న సీనియర్ల ముందు ఆ నివేదికలను పెట్టి వారి విజయావకాశాలు ఏమేరకు ఉన్నాయో ముఖంపైనే చెప్పేస్తున్నారని సమాచారం. అందువల్లనే కాంగ్రెస్​లిస్ట్​ఆలస్యం అవుతున్నదని తెలుస్తున్నది. నేడు (ఒకటవ తేదీన) ఢిల్లీలో స్క్రీనింగ్ భేటీ జరుగాల్సి ఉండగా.. ఈ నెల 6న తేదీకి వాయిదా పడింది. ఈ తర్వాతే జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో సర్వే నివేదికలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గెలుపు కచ్చితం అని తేలినవారికే టికెట్లను ఇవ్వాలని పార్టీ భావిస్తున్నది. పార్టీలో వారి స్థాయి, సీనియారిటీ, అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలు.. ఇవేవీ పరిగణలోకి రావడంలేదు. సునీల్ కనుగోలు టీమ్ గతంలో చేసిన కాన్‌స్టిట్యూయెన్సీ సర్వే, క్యాండిడేట్ సర్వే, తాజాగా చేసిన పాపులర్ సర్వే.. ఇవే అభ్యర్థుల ఎంపికకు క్రైటీరియా. సర్వేల్లో నెగెటివ్ తేలితే వారికి నో చాన్స్. నివేదికను ముందు పెట్టి గెలుపు అవకాశాలు ఏ మేరకున్నాయో ముఖం మీదనే చెప్పేస్తున్నారు. టికెట్ విషయంలో రాజీ పడేది లేదని తేల్చేస్తున్నారు. దీర్ఘకాలంగా పార్టీలో సిన్సియర్‌గా ఉన్నందుకు తగిన ప్రాధాన్యంతో పాటు ప్రభుత్వంలోకి రాగానే మరో రకమైన పదవులు ఇస్తామని ఏఐసీసీ నేతలు భరోసా ఇస్తున్నారు.

గెలుపే క్రైటేరియా..

టికెట్ ఇచ్చిన ప్రతీ వ్యక్తి గెలవాలి.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. ఇది మాత్రమే ఇప్పుడు ఏఐసీసీ సీరియస్‌గా ఆలోచిస్తున్న అంశాలని రాష్ట్ర సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. విజయావకాశాలు లేవని సర్వే నివేదికలో తేలిన తర్వాత టికెట్ ఇచ్చి ప్రయోజనం ఏమున్నదనేది స్పష్టం చేస్తున్నారు. ఓడిపోతున్నట్లు నివేదికలో క్లియర్‌గా కనిపిస్తున్నా టికెట్ ఇస్తే అది ప్రత్యర్థిని గెలిపించినట్లే అవుతుందనేది ఏఐసీసీ నుంచి వస్తున్న లాజిక్ అని వివరించారు. టికెట్ రాకపోవడం సీనియర్లతో పాటు ఆశావహులందరికీ అసంతృప్తిగానే ఉంటుందని, కానీ కన్విన్స్ చేయడం నాయకత్వ లక్షణం అనే అంశాన్ని వారు నొక్కిచెప్తున్నట్లు పేర్కొన్నారు. పవర్‌లోకి రావాలనేది అంతిమ లక్ష్యంగా ఉన్నప్పుడు అందరూ పార్టీ కోసం పనిచేయడం కమిట్‌మెంట్‌గా ఉంటుందన్నారు.

ఖర్గే సూపర్‌ విజన్‌..

పార్టీకి మొదటి నుంచీ సునీల్ కనుగోలు టీమ్ చేస్తున్న సర్వేతో పాటు దానితో సంబంధం లేకుండా రాహుల్‌గాంధీ గ్రౌండ్ రిపోర్టును తెప్పించుకుంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పర్యవేక్షణలో పనిచేస్తున్న టీమ్ ఎప్పటికప్పుడు ఈ రిపోర్టును అందజేస్తున్నది. అభ్యర్థులను ఎంపికచేసే సమయంలో సునీల్ కనుగోలు సర్వే నివేదికలో ఏ తేడా వచ్చినా, సందేహం తలెత్తినా రాహుల్ టీమ్ ఇచ్చిన నివేదికతో పోల్చి చూస్తున్నారు. టికెట్ కోసం పైరవీలు వద్దంటూ చాలా నెలల ముందే ఏఐసీసీ స్పష్టం చేసింది. ఇటీవల బీసీ నేతలు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన సందర్భంగా అభ్యర్థుల ఎంపికకు జరుగుతున్న కసరత్తుపై క్లారిటీ వచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన బీసీ నేతలకు సైతం ఇదే విషయం అర్థమైంది. మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, వీ.హనుమంతరావు తదితరు పలువురు సీనియర్ నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా సర్వే నివేదికలో ఏమున్నదో స్టేట్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న లీడర్లకు తప్ప ఆశావహులకు తెలిసే అవకాశం లేకుండా పకడ్బందీ మెకానిజంను కాంగ్రెస్ అమలుచేస్తున్నది.

గెలుపు గుర్రాలపై స్పెషెల్ స్ట్రాటజీ

కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకంటే స్వతంత్రంగా ఉన్నవారికీ, ఇతర పార్టీలవారికీ విజయావకాశాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం, మోత్కుపల్ల నర్సింహులు తదితరులందరికీ సర్వేలో గెలుపు పక్కా అని తేలడంతో వారిని పార్టీలోకి లాగేలా ఏఐసీసీ పావులు కదిపి సక్సెస్ అయింది. నిజానికి చాలా మంది కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైనా వారికి సర్వే ఆధారంగానే టికెట్ ఇవ్వడంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నది. స్వతంత్రంగా ఉన్న కొద్దిమందికి విజయావకాశాలు ఉంటే వారిని పార్టీలో చేర్చుకోవడమో లేక ఒప్పందం కుదుర్చుకుని పరస్పరం సహకరించుకోడమో అనే ఫార్ములాను అనుసరించనున్నది. ఇలాంటివన్నీ కొలిక్కి తేవడంకోసమే ఫస్ట్ లిస్టును ప్రకటించకుండా టైమ్ తీసుకుంటున్నది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లాంటివారి చేరికలు ఇందులో భాగమే.

6న స్క్రీనింగ్ ​కమిటీ భేటీ

షెడ్యూలు ప్రకారం అక్టోబర్ ఫస్ట్ న స్క్రీనింగ్ కమిటీ భేటీ జరగాల్సి ఉన్నా అది 6వ తేదీకి వాయిదా పడింది. అందులో చర్చల తర్వాత డ్రాఫ్ట్ లిస్టును సెంట్రల్ ఎలక్షన్ టీమ్ పరిశీలించి ఏఐసీసీ ఆమోదంతో ఫైనల్ చేయనున్నది. ఫస్ట్ వీక్‌లోనే ఫస్ట్ లిస్టును రిలీజ్ చేయాలని తొలుత సూచనప్రాయంగా ఏఐసీసీ భావించినా వారం పది రోజుల పాటు ఆలస్యమయ్యే అవకాశమున్నది. జాబితా ఆలస్యమవుతుండడంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. టికెట్ వస్తుందో రాదోననే ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతున్నది. అప్పటివరకూ వీరిలో కన్‌ప్యూజన్ కంటిన్యూ కానున్నది.



Next Story

Most Viewed