తెలంగాణలో సునామీ రాబోతోంది: రాహుల్ గాంధీ

by Disha Web Desk 2 |
తెలంగాణలో సునామీ రాబోతోంది: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సునామీ రాబోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడుతూ.. సంపూర్ణ మెజార్టీలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని అన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాం.. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రూ.500 కే రాష్ట్రం మొత్తం గ్యాస్ సిలిండర్ ఇస్తామని అన్నారు. ధరల భారాన్ని మహిళలు మోస్తున్నందున ప్రతి నెలా వారి ఖాతాల్లో రెండున్నర వేలను డిపాజిట్ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం.

రైతు భరోసా ద్వారా రూ.15 వేలను రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఒక ఎకరానికి ఇస్తాం. రైతు కూలీలకు భూమి లేకపోవడంతో రూ. 12 వేలు ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పేరుతో ఇల్లు కట్టుకోడానికి రూ.5 లక్షలు ఇస్తాం. గృహ జ్యోతి స్కీమ్‌తో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. యువ వికాసం పేరుతో రూ.5 లక్షల మేర ఆర్థిక సాయం కోచింగ్, ఉన్నత విద్య కోసం ఇస్తాం. చేయూత పేరుతో ప్రతి నెలా 4 వేల పింఛన్ ఇస్తాం. ఇవన్నీ కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడిన మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఈ గ్యారంటీల అమలుపై నిర్ణయం జరుగుతుంది. ఇచ్చిన గ్యారంటీలను ఫస్ట్ డే చేయబోతున్నాం. కర్ణాటకలో అక్కడి ప్రతిపక్షాలు చేయలేమన్నారు. కానీ చేసి చూపించాం అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed