చిదంబరం చరిత్రను వక్రీకరిస్తున్నారు.. పొన్నాల లక్ష్మయ్య సీరియస్

by Disha Web Desk 2 |
చిదంబరం చరిత్రను వక్రీకరిస్తున్నారు.. పొన్నాల లక్ష్మయ్య సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ దురుద్దేశ్యంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్ళలేరా? అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేయకపోతే చిదంబరం తెలంగాణ ప్రకటన చేసేవారా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రకటనను చిదంబరం వెనక్కి తీసుకున్నందువల్లే యువకులు బలిదానం చేసుకున్నారని, చరిత్రను చిదంబరం వక్రీకరించారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి? ఖాళీ ఉన్న లక్షా 95వేల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్ని ఖాళీగా ఉన్నాయో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేపట్టిందని తెలిపారు.

రాజ్యాంగానికి లోబడి తెలంగాణ అప్పులు తీసుకుంటుందన్నారు. అప్పులు చేసే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం 22వ స్థానంలో ఉందన్నారు. ఒకటో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉందని, కాంగ్రెస్ నేతలు దమ్ముంటే రాజస్థాన్ అప్పులపై మాట్లాడాలని సవాల్ చేశారు. కేంద్రం ఎన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకుందని మండిపడ్డారు. జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నంను చిదంబరం చేస్తున్నాడని విమర్శించారు. అప్పులు చేయకుండా, భూములు అమ్మకుండా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీంలు అమలు చేయగలరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇస్తున్న హామీలు అమలు కావని, ప్రజలు ఆపార్టీ చెంపదెబ్బ కొట్టి మళ్ళీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed