ప్రమాదంపై స్పందించిన మంత్రి KTR

by Disha Web Desk 2 |
ప్రమాదంపై స్పందించిన మంత్రి KTR
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్మూర్‌ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రచారం రథంపై నుంచి మంత్రి కేటీఆర్ కిందపడిపోయారు. దీంతో ఆయనకు స్వల్పగాయాలు అయ్యాయి. ఈ ఘటన గురువారం ఆర్మూరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకుంది. ప్రచార రథం రెయిలింగ్‌ విరగడంతో కేటీఆర్‌ ప్రచారం రథంపై నుంచి కిందపడ్డారు. కేటీఆర్‌తోపాటు ఎంపీ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా ప్రచార రథంపై నుంచి కిందపడ్డారు. వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. తాజాగా.. ప్రమాదంపై కేటీఆర్ స్పందించారు. ‘అదృష్టవశాత్తు తనకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దు. సేఫ్‌గా అక్కడినుంచి కొడంగల్‌కు కూడా వచ్చాను’ కేటీఆర్ చెప్పారు.

Next Story

Most Viewed