119 నియోజకవర్గాల్లో కేసీఆర్లే ఉన్నారు.. రేవంత్ సవాల్‌కు కౌంటర్

by Disha Web Desk 2 |
119 నియోజకవర్గాల్లో కేసీఆర్లే ఉన్నారు.. రేవంత్ సవాల్‌కు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దమ్ముంటే తమపై పోటీకి రావాలని కొందరు నన్ను సవాలు చేస్తున్నారని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వాళ్లందరూ లోకల్‌గా కేసీఆర్లే అని వాళ్లతో తలపడాలని ప్రతిపక్ష నేతలకు గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. కొంతమంది చిన్నంతరం పెద్దంతరం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, నేను తెలంగాణ కోసం తిరిగినప్పుడు వీరంతా ఎవరి బూట్ల దగ్గర కూర్చున్నారో అందరికీ తెలుసన్నారు. గురువారం వనపర్తిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. పిడికెడు మందిని పట్టుకుని తెలంగాణ కోసం పోరాడేందుకు బయలుదేరాను.

14 ఏళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చింది. గడిచిన 10 ఏళ్లలో ఏం చేశామన్నది కళ్ల ముందే కనిపిస్తోంది.. వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిని చేసిన మొనగాడు ఎవడు? గంజి కేంద్రం పెడతామంటే గుంజి కొట్టేలా పరిస్థితి మార్చాం. వనపర్తికి ఎవరు కావాలో నిర్ణయించాల్సింది ప్రజలే. తెలంగాణ కోసం గొంతు ఎత్తింది ఎవరో.. నేతల కాళ్ల దగ్గర కూర్చున్నది ఎవరో గుర్తు చేసుకోవాలన్నారు. పాలమూరు జిల్లాకు ఏ కాంగ్రెస్ నేత అయినా మెడికల్ కాలేజీ తెచ్చారా? ముస్లింలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా చూసిందని, తమ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారు. మళ్లీ గెలిస్తే పింఛన్లు దశల వారీగా రూ. 5 వేలకు పెంచుతామన్నారు. రైతు బంధు, దళిత బంధును పుట్టించిందే కేసీఆర్ అన్నారు. వాల్మికీల హక్కుల కోసం అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి పంపితే ఈ మోడీ మొద్దు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ఈసారి కూడా వాల్మికి హక్కుల కోసం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పారు.



Next Story

Most Viewed