కాంగ్రెస్ పార్టీ ఏది చెబితే అది ఖచ్చితంగా చేస్తుంది: ఖర్గే

by GSrikanth |
కాంగ్రెస్ పార్టీ ఏది చెబితే అది ఖచ్చితంగా చేస్తుంది: ఖర్గే
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని మరోసారి ఇవాళ ట్విట్టర్ వేదికగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఏది చెబితే అది ఖచ్చితంగా చేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అది చేయడం లేదని విమర్శించారు. మరో ట్వీట్ చేస్తూ.. ఇవాళ జరిగే ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌లో ప్రజల కేంద్రీకృత సమస్యలపై చర్చించడానికి ఇండియా పార్టీలు ఎదురుచూస్తున్నాయని వెల్లడించారు. ప్రజల అభీష్టాన్ని, వారి అసంఖ్యాక ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవిస్తుందని తాము హృదయపూర్వకంగా ఆశిస్తున్నామని తెలిపారు. దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని తాము నిశ్చయించుకున్నామని పేర్కొన్నారు. జుడేగా భారత్, జీతేగా ఇండియా అంటూ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed