బీఆర్ఎస్‌కు BIG షాక్.. పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా

by GSrikanth |
బీఆర్ఎస్‌కు BIG షాక్.. పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో కన్నీరు పెట్టి మరీ అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో మహిళలకు విలువ లేదని ఆవేదన చెందారు. ఈసారి ఒంటరిగా పోటీచేసి బీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు బుద్ధి చెప్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖానాపూర్ గడ్డ.. రేఖానాయక్ అడ్డ అని ప్రకటించారు. ఇక్కడ మరో నేత గెలిచే అవకాశం లేదని, ఎలా గెలుస్తారో తానూ చూస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, బీఆర్ఎస్‌ ఖానాపూర్ టికెట్ ఆశించిన ఆమెకు పార్టీ అధిష్టానం అనూహ్య షాకిచ్చింది. ఖానాపూర్‌ టికెట్‌ను మంత్రి కేటీఆర్ బాల్య మిత్రుడైన జాన్సన్ నాయక్‌కు ఖరారు చేసింది. దీంతో గతకొంతకాలంగా అసహనంతో ఉన్న ఆమె చేసేదేం లేక పార్టీకి ఇవాళ రాజీనామా చేశారు.




Next Story

Most Viewed