కేసీఆర్కు ఎన్నికల ముందే హామీలు గుర్తుకొస్తాయి.. సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు

by Javid Pasha |
కేసీఆర్కు ఎన్నికల ముందే హామీలు గుర్తుకొస్తాయి.. సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. అందరూ సీఎంలు ప్రమాణ స్వీకారం తర్వాత హామీలు నెరవేరిస్తే కేసీఆర్ కు మాత్రం ఎన్నికల ముందే హామీలు గుర్తుకొస్తాయని అన్నారు. నాలుగేళ్ల గడీల్లో మొద్ద నిద్రపోయిన సీఎం కేసీఆర్..ఓట్ల కోసం అటకమీద దాచిన ఫేనిఫెస్తో తిరగేస్తున్నారని అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో బీఆర్ఎస్ నేతకలకు దాచుకోవడం, దాచుకోవడమే సరిపోయిందని అన్నారు. రుణమాఫీకి డబ్బుల్లేక మూడు నెలల ముందే కొత్త టెండర్లకు వేలం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రేట్లు, ట్యాక్స్ పెంచి ప్రజల రక్తం తాగడం చాలదన్నట్లు ఇప్పుడు మద్యం టెండర్లు ముందుగానే నిర్వహిస్తున్నారని చెప్పారు.

‘‘అదే చేతితో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వండి. నిరుద్యోగ భృతి ఇవ్వండి. వరద బాధితులను ఆదుకోండి. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వండి. చట్ట సభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయండి. ఆగిపోయిన దళిత బంధును, మైనార్టీ బంధును అమలు చేయండి. బీసీల్లోని అన్ని కులాలకు బీసీ బంధు ఇవ్వండి. ఎన్నికలకు ముందే రెండు దఫాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి నిరూపించుకోవాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.Next Story

Most Viewed