వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.. వైఎస్ షర్మిల

by Javid Pasha |
వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.. వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ షర్మిల అన్నారు. శనివారం దివంగత నేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కూతురు, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు.

ఆయన పాలన తరతరాలకు ఆదర్శమని తెలిపారు. వైఎస్ఆర్ అద్భుతమైన పథకాలు అమలు చేశారని కొనియాడారు. ఈ రోజు వైఎస్ఆర్ ను స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందని షర్మిల కృతజతలు తెలిపారు.Next Story

Most Viewed