కర్ణాటక ఎన్నికల ఫలితాలపై YS షర్మిల రియాక్షన్ ఇదే

by GSrikanth |
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై YS షర్మిల రియాక్షన్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీ మత రాజకీయాలకు, బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు "చెంపపెట్టు" అని విమర్శలు గుప్పించారు. ప్రజలను అమాయకులను చేసి, స్వార్థ రాజకీయాలకు పాల్పడితే ఇలాంటి తీర్పే వెలువడుతుందని ఎద్దేవా చేశారు. కులం, మతం, డబ్బు, అధికారమదంతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరని మండిపడ్డారు. నియంత పాలనను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం సైతం ఎదురుచూస్తోందంటూ షర్మిల ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed