Viral: ఫ్రీ బస్సు జర్నీ.. బూతులు తిట్టిన మహిళ

by Disha Web Desk 3 |
Viral: ఫ్రీ బస్సు జర్నీ.. బూతులు తిట్టిన మహిళ
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉంచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించింది. మహిళలు ఇబ్బందులు ఎదుర్కోకూడదు, స్వేచ్ఛగా బయటకి వచ్చి వాళ్ళ పనులు చేసుకోవాలకి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. మహిళల మంచి కోసం ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే ప్రభుత్వం తప్పు అనేలా కొందరు మహిళలు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ అభిప్రాయాలను బూతుల్లో తెలియచేస్తున్నారు.

బస్సులో సీటు దొరికితే పర్లేదు.. కానీ సీటు దొరకకపోతేనే కొందరు మహిళకు కాళికా రూపం దాలుస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కూర్చునేందుకు సీటు లేకపోవడంతో ఓ మహిళ ఓ వైపు సాటి మహిళలను దుర్భాషలాడుతూనే మరో వైపు ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. ఓట్లే గెలిపిస్తే అధికారం లోకి రాగానే ఇలా ఆధార్ ఫ్రీ పెట్టిండు.. బస్సులో కనీసం సీటుకూడా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా ఆ సన్నివేశాన్ని అంత వీడియో తీసిన ఓ వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది. కాగా ఆ వీడియో చూసిన నెటిజన్స్ అనేక రకాలుగా స్పందిస్తున్నారు. మీరు కోరుకున్నదే కదా అని ఒకరు, కొత్త కొత్త బూతులు నేర్చుకోవాలంటే ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మరొకరు, ఇక ఈ వీడియోకి కకేసీఆర్ డైలాగ్ ఇప్పుడేంచేద్దామంటావ్ మరి అని ఇంకొకరు ఇలా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed