పద్దెనిమిది ఏండ్లు నిండితే చాలు.. ఎవరు ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు.. కోర్టు పర్మిషన్

by Dishafeatures3 |
పద్దెనిమిది ఏండ్లు నిండితే చాలు.. ఎవరు ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు.. కోర్టు పర్మిషన్
X

దిశ, ఫీచర్స్ : లైంగిక సంబంధాలు ఇద్దరు భార్యాభర్తల మధ్యే ఉండాలని భారతీయ సామాజిక నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అలా కాకుండా ఇతరులతో సంబంధం పెట్టుకుంటే నేరంగా పరిగణిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ పెద్దలు శిక్షలు కూడా వేస్తారు. కానీ తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పద్దెనిమిది ఏండ్లు నిండిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇష్టప్రకారం ఇల్లీగల్ రిలేషన్‌లో ఉంటే తప్పు లేదని తెలిపింది. అంటే వారి వివాహ స్థితితో సంబంధం లేకుండా ఇద్దరి మధ్య అంగీకారంతో లైంగిక కార్యకలాపాలు జరిగితే ఎటువంటి తప్పు లేదని స్పష్టం చేసింది.

ఒక యువతిని పెళ్లి అనే సాకుతో వివాహితుడు మోసం చేశాడనే కేసు విచారణలోకి రాగా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్టం ఉంటే అది అత్యాచారం లేదా మోసం కిందకు రాదని కోర్టు చెప్పింది. అతను బలవంతపు సంబంధం పెట్టుకున్నట్లు ధృవీకరించబడలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేసింది. పైగా నిందితుడి వైవాహిక స్థితి గురించి తెలిసిన తర్వాత కూడా అమ్మాయి సంబంధాన్ని కొనసాగించిందని.. ఇద్దరు ఇష్టపడే చేశారని అభిప్రాయపడింది.

అయితే ఈ తీర్పు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్రమ సంబంధం పెట్టుకునేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చిందని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో సంప్రదాయాలు మంటగలిసిపోతాయని.. ఇష్టారీతిన రెచ్చిపోతారనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతి భారత్‌లోకి పూర్తిగా వచ్చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి.

Next Story

Most Viewed