మాధవీలతకు ఎదురు గాలి?.. కరపత్రం ఇస్తుండగా నెట్టేసిన మహిళ (వీడియో వైరల్)

by Disha Web Desk 5 |
మాధవీలతకు ఎదురు గాలి?.. కరపత్రం ఇస్తుండగా నెట్టేసిన మహిళ (వీడియో వైరల్)
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి మాధవీలతకు ఎదురు గాలి వీస్తోంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ప్రచారంలో భాగంగా పార్లమెంట్ పరిధిలోని ఓ ఇంటికి వెళ్లి, ఆ ఇంటి బయట మహిళకు కరపత్రం ఇచ్చి ఓటు వేయాలని మాధవీలత అభ్యర్ధిస్తున్నారు. ఇంతలో ఆ మహిళ కరపత్రం తీసుకోకుండా బీజేపీ అభ్యర్ధిని తోసేస్తుంది. ఆగ్రహానికి గురైన మాదవీలత వీడియో ఎందుకు తీస్తున్నావ్ అంటూ ఓ వ్యక్తిపై మండిపడింది. ఈ వీడియోకి హైదరాబాద్ ప్రజలు బీజేపీ వద్దు అనుకుంటున్నారా? అని జత చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. పరువు పోతుందని ఫోటో తీయోద్దని అంటుందని, హైదరాబాద్ ప్రజలు విజ్ఞత కలిగిన వారని అంటుండగా, మరికొందరు కావాలనే చేస్తున్నారని, ఇదంతా ట్రాష్ అని ఇలా పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed