ప్రతి రూపాయి ప్రజల ముందు పెడతాం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
ప్రతి రూపాయి ప్రజల ముందు పెడతాం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమ్మక్క సారక్క జాతర అనంతరం మేడారం జాతరకు అయిన ఖర్చును ప్రజల సమక్షంలో బయటపెడతామని మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతర నిర్వహణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమం నిధుల నుంచి మొదటి బిల్లు సమ్మక్క సారక్క తల్లులకే ప్రభుత్వం రిలీజ్ చేసిందని గుర్తుచేశారు. ఈ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా.. ఇటు మెయింటెనెన్స్ దగ్గర నుంచి డెవలెప్‌మెంట్ వరకు ప్రతి పనిని కలెక్టర్ ద్వారా చేపడుతున్నామని తెలిపారు.

మెయింటెనెన్స్ కూడా చాలా ఖర్చు అవుతుందని, 14 వేల మంది అధికారులు, 11 వేల మంది పోలీసులు, పవర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ ఇలా కనపడకుండా చాలా మెయింటెనెన్స్ వస్తుందని తెలిపారు. జాతర అనంతరం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ప్రజల ముందు పెడతామని, మిగిలిన నిధులను ఈ ప్రాంగణంలోనే డెవలెప్‌మెంట్ కు, అలాగే సమ్మక్క సారక్క కీర్తి ప్రతిష్టలు చాటేలా.. వేయ్యేళ్లు ఉండేలా శిలాశాసనాలను లిఖించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలియజేశారు.


Next Story

Most Viewed