ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్‌ తెలంగాణలో నెలకొల్పాం: మంత్రి కేటీఆర్

by Disha Web Desk 19 |
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్‌ తెలంగాణలో నెలకొల్పాం: మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: 2023లో ఇమేజ్ టవర్స్ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్‌ను నెలకొల్పామని, గురువారం సాయంత్రం దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైప్ సెంటర్టీ - వర్క్స్‌ను ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీ ప్రారంభిస్తారన్నారు. టీ వర్క్స్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. టీ వర్క్స్‌లో వందల వేల స్టార్టప్‌లు పనిచేస్తాయని, గ్రామీణ ప్రాంత ఓత్సాహిక యువతకు దోహదపడుతందన్నారు.

టీ- వర్క్స్‌కు స్కూల్ విద్యార్థులను కూడా తీసుకు వచ్చి అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లలో శాటిలైట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని, గ్రామీణ ప్రాంత ఇన్నోవేటర్స్‌కు జిల్లాలో ఉన్న ఐటీ టీమ్ గైడ్ చేస్తుందని స్పష్టం చేశారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని, స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నాలుగు సంవత్సరాలుగా రన్ చేస్తున్నామని తెలిపారు. ఔత్సాహిక యువకులు ఎవరూ వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చినా సపోర్ట్ చేస్తామని వెల్లడించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed